Sameera Reddy: ఏరుదాటి తెప్ప తగలేసే హీరోయిన్స్ .. చూసి నేర్చుకోండమ్మా
ABN, Publish Date - Nov 20 , 2026 | 07:41 PM
ఈమధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు.. బాలీవుడ్ కి వెళ్లి సౌత్ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఒకరి తరువాత ఒకరు సౌత్ లో గ్లామర్ షో ఎక్కువ ఉంటుందని, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని, సౌత్ సినిమాల్లో చేసి తప్పు చేశామన్నట్లు చెప్పుకొచ్చారు.
ఈమధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు.. బాలీవుడ్ కి వెళ్లి సౌత్ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఒకరి తరువాత ఒకరు సౌత్ లో గ్లామర్ షో ఎక్కువ ఉంటుందని, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని, సౌత్ సినిమాల్లో చేసి తప్పు చేశామన్నట్లు చెప్పుకొచ్చారు. అలా చెప్పినవారిలో తాప్సి పన్ను, తమన్నా, రాధికా ఆప్టే ఇలా చాలా పేర్లు ఉన్నాయి. తెలుగు సినిమాలు చేసి.. ఇక్కడ గుర్తింపు తెచ్చుకొని, బాలీవుడ్ కి వెళ్లి.. కొంచెం ఫేమస్ అవ్వగానే సౌత్ సినిమాలను కించపరుస్తూ మాట్లాడుతున్న ఈ హీరోయిన్లపై నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ మధ్య ఒక బాలీవుడ్ బ్యూటీ.. సౌత్ సినిమాలే తన గుర్తింపు అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరా రెడ్డి (Sameera Reddy).
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్‌లాల్ వంటి దిగ్గజ స్టార్ హీరోల సరసన నటించిన సమీరా తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ , సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమల మధ్య ఉన్న తేడాల గురించి చెప్పుకొచ్చింది. సౌత్ సినిమా ఇండస్ట్రీ తనకు ఎంతో గౌరవం, స్టార్డమ్తో పాటు మంచి పారితోషికాన్ని కూడా అందించిందని, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పనిచేసిన అనుభవం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలోనే తనకు ప్రొఫెషనల్ రెస్పెక్ట్, ఆర్థిక ప్రతిఫలం, గుర్తింపు ఎక్కువగా లభించాయని స్పష్టం చేసింది.
'దక్షిణాదిలో నాకు లభించిన గౌరవం, కళాత్మక విలువ, పారితోషికం, స్టార్డమ్.. హిందీ చిత్ర పరిశ్రమలో నేను పొందిన వాటికంటే ఎంతో ఎక్కువ. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. వారణం ఆయిరం (సూర్య సన్నాఫ్ కృష్ణన్ ) సినిమాలోని మా మేఘన మీరే కద అంటూ 18 ఏళ్ల తర్వాత కూడా దక్షిణాది అభిమానులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తుంటారు. నా మనసులో ఎప్పటికీ ముందుగా ఒక సౌత్ ఇండియన్ నటిగానే భావిస్తాను. ఇలాంటి గుర్తింపు నాకు బాలీవుడ్ లో కనిపించలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. అది సౌత్ ఇండస్ట్రీ అంటే.. ఏరుదాటాక తెప్ప తగలేసే హీరోయిన్స్, సమీరాని చూసి నేర్చుకోండమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే పెళ్లి తరువాత తన ఇద్దరు పిల్లల బాధ్యతల కోసం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమీరా, ఇటీవల సంజయ్ దత్ నటించిన ఆఖ్రీ సవాల్ తో రీఎంట్రీ ఇచ్చింది. తన ఫ్యామిలీ కమిట్మెంట్లను అర్థం చేసుకుని సంజయ్ దత్ రెండు మూడు నెలల పాటు కేవలం వీకెండ్స్‌లోనే షూటింగ్‌కు అడ్జస్ట్ చేశారని సమీరా తెలిపింది. మరి ముందు ముందు సమీరా రెడ్డి తెలుగు, తమిళ్ భాషల్లో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.