Sameera Reddy: ఆ బ్రాలు పెట్టుకోవాలని టార్చర్ చేసేవారు
ABN, Publish Date - Jul 18 , 2026 | 04:10 PM
ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ తెరముందు కనిపించేది వేరు.. తెర వెనుక జరిగేది వేరు. కెమెరాలో అందంగా కనిపించాలని, హాట్ గా కనిపించాలని హీరోయిన్లను ఒత్తిడి చేసేవారు చాలామంది ఉంటారు.
ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ తెరముందు కనిపించేది వేరు.. తెర వెనుక జరిగేది వేరు. కెమెరాలో అందంగా కనిపించాలని, హాట్ గా కనిపించాలని హీరోయిన్లను ఒత్తిడి చేసేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాల విషయంలో అయితే ప్రతి హీరోయిన్ కి టార్చరే అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి (Sameera Reddy) సైతం ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెలుగులో అశోక్, నరసింహుడు, జై చిరంజీవ లాంటి సినిమాలతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది.
ఇక తల్లి అయ్యాక ఆమె బరువు పెరిగి ఎన్నో తరోల్స్ కి గురైంది. అయినా కూడా వాటిని తట్టుకొని ప్రస్తుతం బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమాలలో కాకుండాఆ యాడ్స్ తో బిజీగా ఉన్న సమీరా ఒక ఇంటర్వ్యూలో తాను హీరోయిన్‌గా నటించే రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. సినిమాల్లో హీరోయిన్ల అప్పియరెన్స్, బాడీ షేప్ ను చూపించడం కోసం ఫిల్మ్ మేకర్స్ ఎంతలా దిగజారుతారో ఆమె చెప్పుకొచ్చింది.
'నేను హీరోయిన్ గా పనిచేసే సమయంలో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోవాలని డైరెక్టర్స్ విపరీతంగా టార్చర్ పెట్టేవారు. 20 ఏళ్లు నేను ఆ బాధను అనుభవించాను. సాధారణంగా బ్రెస్ట్ ఎత్తుగా కనిపించాలని ప్యాడెడ్ బ్రాలు పెడుతూ ఉంటారు. అవి మనకు సౌకర్యంగా లేకపోయినా పెట్టుకోవాలి. ఇక వీటితో పాటు మీ బంప్ ఫ్లాట్‌గా ఉంది అంటూ నడుం కింద కూడా బలవంతంగా బ్రాలు పెట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి బ్రాలు వేసుకోవాలని డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చి చెప్తారు' అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమీరా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమీరా కన్నా ముందు చాలామంది హీరోయిన్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.