సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: భాయ్ తో బంగారం రొమాన్స్.. భర్తే డైరెక్టర్

ABN, Publish Date - May 02 , 2026 | 05:41 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోనే ఉన్నారు. కానీ, ఆ ఛాన్స్ మాత్రం ఆమెకు దక్కలేదు.

Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తోనే ఉన్నారు. కానీ, ఆ ఛాన్స్ మాత్రం ఆమెకు దక్కలేదు. తన భర్త రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ హనీ బన్నీ నటించారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. సిటాడెల్ పరాజయం పాలయ్యింది. అందులోనూ ఈ రెండు వెబ్ సిరీస్ లు కావడంతో ఇంకా సామ్ బాలీవుడ్ ఎంట్రీ కోరిక నెరవేరలేదు.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే సమంత బాలీవుడ్ ఎంట్రీ చేయనున్నారని తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే ఒక మంచి కథతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ళడం.. అది ఆయనకు బాగా నచ్చి కథను ఓకే చేయడం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్. ఇక ఈ చిత్రంలో సల్లూ భాయ్ సరసన హీరోయిన్ గా సమంతను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


రాజ్ అండ్ డీకే కథల్లో ఎప్పుడూ హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కేవలం గ్లామర్ ఒలకబోసే పాత్ర కాకుండా కథను నడిపించే పాత్రల్లో హీరోయిన్ కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర అలానే ఉండబోతుందంట. అందుకే వేరే హీరోయిన్ ఎందుకు.. సామ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అని ఆమెనే ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సామ్ కోరికను భర్త రాజ్ నెరవేర్చినట్లే.

Updated Date - May 02 , 2026 | 05:53 PM