సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salman khan: కర్ణుడి పాత్రలో సల్మాన్‌ ఖాన్‌.. రాకేష్‌ మెహ్రా భారీ ప్రాజెక్ట్‌

ABN, Publish Date - Aug 30 , 2026 | 10:21 AM

బాలీవుడ్‌లో మరో భారీ పౌరాణిక చిత్రం తెరపైకి రాబోతుందా? అవుననే చెబుతోంది బాలీవుడ్ మీడియా.

బాలీవుడ్‌లో మరో భారీ పౌరాణిక చిత్రం తెరపైకి రాబోతుందా? అవుననే చెబుతోంది బాలీవుడ్ మీడియా. మహాభారతంలోని అత్యంత శక్తిమంతమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు రాకేష్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కర్ణుడి పాత్రలో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఐదేళ్లుగా ప్రాజెక్ట్‌పై కసరత్తు..

‘కర్ణ’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై దర్శకుడు రాకేష్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా గత ఐదేళ్లుగా పని  చేస్తున్నారట. కథ, పాత్రల రూపకల్పన, భారీ యుద్ధ సన్నివేశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసినట్లు సమాచారం. మహాభారతంలోని కర్ణుడి జీవితం, ఆయన ఎదుర్కొన్న సంఘర్షణలు, వీరత్వం, విషాదాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు  ప్రచారం జరుగుతోంది.కర్ణుడిగా సల్మాన్‌?ఈ సినిమాలో టైటిల్‌ పాత్ర అయిన కర్ణుడిగా సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నట్లు సమాచారం. సల్మాన్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు మహాభారతంలోని శక్తిమంతమైన యోధుడి పాత్ర తోడైతే అది భారీ స్థాయిలో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌–మహాభారతం–రాకేష్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా కాంబినేషన్‌ బాలీవుడ్‌లో ఆసక్తిగా మారింది. దాదాపు ఐదేళ్లుగా అభివృద్ధి దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.   .

Updated Date - Aug 30 , 2026 | 10:30 AM