Salman khan: రాజ్ అండ్ డీకేతో సల్మాన్ ఖాన్.. రిలీజ్ ఎప్పుడంటే?
ABN, Publish Date - Nov 19 , 2026 | 08:46 AM
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (salman khan) మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథాంశాలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందించే దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే కీలక పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే సల్మాన్ ఖాన్ లుక్ టెస్ట్ కూడా జరగనుందట. ఆయన పాత్రకు తగ్గట్టుగా లుక్, ఇతర అంశాలను ఖరారు చేసే పనిలో దర్శక ద్వయం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో పాటు రాజ్ అండ్ డీకే కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 క్రిస్మస్ సందర్భంగా లేదా 2028 ప్రారంభంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.