సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Salman Khan: మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ సల్మాన్ కౌంటర్

ABN, Publish Date - Jul 20 , 2026 | 05:44 PM

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

Salman khan


బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ (Salman Khan health) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఆయన   చెక్‌ పెట్టారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ కాస్త సన్నగా, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ సోషల్‌ మీడియాలో పలు కథనాలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్‌లో స్పందించారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలను షేర్ చేసి 'మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది? అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ పోస్ట్ తో ఆయన ఆరోగ్యంపై వస్తున్నా వదంతులకు  పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు హింట్‌ ఇచ్చారు. దీనికి  బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పలువురు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్లు చేయగా, మరికొందరు "మీరిలాగే ఫిట్‌గా ఉండాలి", "మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.  

 ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ 'మాతృభూమి' (Matrubhoomi) చిత్రంలో నటిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నప్పటికీ, సెన్సార్‌ సమస్యల కారణంగా ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు.  

Updated Date - Jul 20 , 2026 | 05:49 PM