సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్‌ బ్లోయింగ్‌ డీల్‌!

ABN, Publish Date - Sep 25 , 2026 | 09:19 PM

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాన్‌స్టర్’కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

Salman and Nayan

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాన్‌స్టర్’ (Monster). లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగానే.. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే రీతిలో మైండ్ బ్లోయింగ్ బిజినెస్ డీల్ కుదుర్చుకుంది.


ఈ చిత్రానికి సంబంధించిన ఆల్ ఇండియా థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజం ‘పీవీఆర్ ఐనాక్స్’ (PVR INOX) ఏకంగా రూ. 100 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత సినిమా మార్కెట్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ రంగానికి చెందిన అగ్ర సంస్థ ఇంతటి భారీ మొత్తాన్ని రిఫండబుల్ అడ్వాన్స్ పద్ధతిలో పెట్టుబడిగా పెట్టడం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్, వంశీ పైడిపల్లి మేకింగ్, దిల్ రాజు ప్రొడక్షన్ వేల్యూస్‌పై ఉన్న అపారమైన నమ్మకంతోనే పీవీఆర్ ఐనాక్స్ ఈ రిస్క్ చేసి భారీ డీల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరికొత్త మేకోవర్‌తో పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. నయనతారతో పాటు అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027 ఈద్ పండుగ కానుకగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా రూ. 100 కోట్ల సంచలన డీల్‌తో ‘మాన్‌స్టర్’ సినిమాపై హైప్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.

ఇవి కూడా చదవండి:

గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్

నయనతార ‘హాయ్’ ఓటీటీకి వచ్చేసింది.. మరి ‘టాక్సిక్’ స్ట్రీమింగ్ ఎప్పుడు?

‘లవ్ అండ్ వార్’.. రెట్రో లుక్‌లో సెగలు రేపుతోన్న ఆలియా

Updated Date - Sep 25 , 2026 | 09:19 PM