సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Pallavi: నా మనసులో మాటను ఆమిర్‌తో చెప్పా

ABN, Publish Date - May 07 , 2026 | 01:20 PM

ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఏక్‌ దిన్‌’. సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు



ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఏక్‌ దిన్‌’. సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌పై సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఏక్‌ దిన్‌’ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. మేకర్స్‌ నన్ను సంప్రదించిన సమయంలో చాలా భావోద్వేగభరిత, బరువైన పాత్ర గల చిత్రాల్లో నటిస్తున్నాను. అందుకే మనసుకు కాస్త హాయిగా, ఒత్తిడి లేని  లైటర్‌వే క్యారెక్టర్‌ చేయాలనుకున్నా. ఈ కథ విన్నప్పుడు హాలీవుడ్‌ క్లాసిక్‌ ‘బిఫోర్‌ సన్‌రైజ్‌’ మూవీ గుర్తుకు వచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను.

అయితే ప్రీమియర్‌ షో చూసిన తర్వాత ఆ ఇందులో పోషించిన మీరా రంగనాధన్‌ పాత్రకు నేను సరిపోలేదని అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్‌ఖాన్‌తో చెప్పాను. నన్ను కాకుండా  చురుగ్గా ఉండే కొత్త అమ్మాయిని ఎంపిక చేసుంటే బాగుండేదేమో.. వాళ్లు ఈ పాత్రకు  న్యాయం చేేసవాళ్లు’ అని నా మనసులో మాటను ఆయనకు చెప్పాను’ అన్నారు. అయితే హీరో జునైద్‌ మాత్రం ఆమె మాటలను అంగీకరించలేదు. ఈ పాత్రకు సాయి పల్లవి పర్ఫెక్ట్‌ సెలెక్షన్‌ అని అన్నారు. జునైద్‌, సాయి పల్లవి జంటగా సునీల్‌ పాండే దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆమిర్‌ఖాన్‌ నిర్మాత. థాయ్‌ సినిమా ‘వన్‌ డే’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ నెల ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Updated Date - May 07 , 2026 | 01:25 PM