సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Pallavi: భర్త తప్పు చేసినా పర్లేదు..

ABN, Publish Date - Oct 30 , 2026 | 11:37 AM

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామాయణ సినిమా రిలీజ్ కి దగ్గరపడుతుండడంతో ఎక్కడ చూసినా సాయిపల్లవినే కనిపిస్తోంది.

Sai Pallavi

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామాయణ సినిమా రిలీజ్ కి దగ్గరపడుతుండడంతో ఎక్కడ చూసినా సాయిపల్లవినే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రామాయణ లాస్ ఏంజెల్స్ ప్రీమియర్స్ లో రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు అని గట్టి స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద వివాదంలో ఇరుక్కున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే, తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి రామాయణ టీమ్ అతిధులుగా హాజరయ్యారు. ఈ షోలో సాయిపల్లవి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.


సాధారణంగా పెళ్లి కానీ ఏ హీరో అయినా.. హీరోయిన్ అయినా ఒక షోకి వెళ్లారు అంటే వారికి ఎదురయ్యే కామన్ ప్రశ్న.. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి?' అని, కెబిసి వేదికగా అమితాబ్ బచ్చన్ కూడా సాయిపల్లవిని నేరుగా ఇదే ప్రశ్న అడిగేశారు. 'నీకు కాబోయే వరుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి?' అని బిగ్-బి అడగ్గానే, సాయిపల్లవి కాస్త సిగ్గుపడుతూనే చాలా స్పష్టమైన, క్యూట్ సమాధానం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిది.


తనకు కాబోయే వరుడు ముందుగా ఒక మంచి మనిషి అయి ఉండాలని, ఆ వ్యక్తికి తానే గొప్ప అనే అహంకారం లేదా భావన ఉండకూడదని చెప్పుకొచ్చింది. ప్రతి విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకునే గుణం ఉండాలని, మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనని, కానీ వాటిని గుర్తించి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఇక చివరగా తనను పెళ్లి చేసుకోవడానికి పెద్ద క్వాలిఫికేషన్ లిస్ట్ ఏమీ లేదని చెబుతూ.. 'అతను బాగా వంట చేసేవాడైతే మరింత బెటర్' అని సరదాగా అనడంతో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆడియన్స్ అందరూ గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఏదిఏమైనా సాయిపల్లవికి కాబోయే భర్త తప్పు చేసినా సరిదిద్దుకుంటే సరిపోతుందన్నమాట..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:37 AM