సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డ్రగ్స్ కేసు.. శ్రద్ధాకపూర్, నోరాల‌కు ఊరట?

ABN, Publish Date - Apr 27 , 2026 | 07:56 AM

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీలకు ఊరట లభించనుంది.

Shraddha Kapoor, Nora Fatehi

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), నోరా ఫతేహీ (Nora Fatehi)లకు ఊరట లభించనుంది. 2022లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ముంబాయి పోలీసులు దాఖలు చేయనున్న అను బంధ చార్జిషీట్‌లో వీరికి క్లీన్‌చిట్ లభించనున్నట్లు సమాచారం. వీరితోపాటు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా సెలెబ్రిటీ ఓర్హాన్, నటుడు సిద్ధాంత్ కపూర్, రాజకీయవేత్త జీషన్ సిద్ధిఖీలకు కూడా ఊరట లభించే అవకాశాలున్నట్లు తెలిసింది.

సరైన సాక్ష్యాధారాలు లభించనందున వీరిని కూడా ఈ కేసు నుంచి తప్పించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2022లో వెలుగు చూసిన భారీ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ తరలింపు నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు శ్రద్ధాకపూర్, నోరా ఫతేహి మరికొందరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలుమార్లు శ్రద్ధాకపూర్, నోరా ఫతేహిలను విచారించారు. డ్రగ్స్ సరఫరా నెట్వ ర్క్ తో తమకు ఎటువంటి సంబంధం లేదని వారు పోలీసులకు స్పష్టం చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 07:56 AM