రష్మిక నోట.. ఎఫ్ మాట
ABN, Publish Date - May 18 , 2026 | 01:58 PM
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి వరుస విజయాలను అందుకొంటున్న హీరోయిన్ గా రష్మికకు మంచి పేరు ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి వరుస విజయాలను అందుకొంటున్న హీరోయిన్ గా రష్మికకు మంచి పేరు ఉంది. ఇక తెలుగు కుర్రాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ను పెళ్ళి చేసుకొని తెలుగింటి కోడలిగా మారిన రష్మిక.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. బాలీవుడ్ లో ఆమె నటించిన తాజా చిత్రం కాక్ టైల్ 2 (Cocktail 2). షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon) , రష్మిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు.
ఇప్పటికే కాక్ టైల్ 2 నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్ లో రష్మిక నోరు జారింది. ఎఫ్ పదాన్ని వాడి అందరికి షాక్ ఇచ్చింది. కృతి సనన్ అందం గురించి పొగుడుతూ రష్మిక ఎఫ్ పదాన్ని వాడింది. 'నువ్వు చాలా హాట్ గా ఉంటావు. అది ప్రపంచానికి తెలుసు. నిజంగా ఉన్న **కింగ్ హాట్' అంటూ మాట్లాడింది. ఆ పదం అన్న వెంటనే నాలుక కరుచుకొని సారీ.. సారీ .. సైలెంట్ చేయండి అంటూ కవర్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రష్మిక ఎఫ్ పదంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు తెలుగింటి కోడలు.. ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే అత్తవారింటికి చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి వివాదాలు.. ఎదుగుతున్న క్రమంలో మంచివి కావు అని హితబోధ చేస్తున్నారు. సహనటి పై ప్రేమతో రష్మిక ఆపుకోలేక ఆ మాట అన్నది కానీ, కావాలని అయితే అని ఉండదు.. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా రష్మిక నోట.. ఆ మాట రావడం కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. మరి దీనిపై రష్మిక ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.