సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రణవీర్.. అన్ ప్రొఫెషనల్‌! లాస్ 40 కోట్లు తిరిగివ్వాల్సిందే

ABN, Publish Date - Feb 10 , 2026 | 10:41 PM

డాన్ (Don) సినిమాకు బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

Ranveer Singh

డాన్ (Don) సినిమాకు బాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మొద‌ట అమితాబ్‌తో రూపొందిన డాన్ చిత్రం హిందీ ప‌రిశ్ర‌మ‌లో పెను సంచ‌ల‌నమే సృష్టించింది. క‌ల్ట్ క్లాసిక్‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. కాల‌గ‌మ‌నంలో 2006లో షారుఖ్ ఖాన్ హీరోగా ఈ సినిమాను తిరిగి రిమేక్ చేసి పెద్ద విజ‌యాన్నిద‌క్కించుకున్నారు. ఆపై 2011లో దానికి సీక్వెల్ సైతం వ‌చ్చింది. అయితే దీనికి కొన‌సాగింపుగా ఓ పుష్క‌రం త‌ర్వాత రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా డాన్ 3 సినిమాను 2023లోనే ఎనౌన్స్ చేశారు. ఫరాన్ అక్తర్ (Farhan Akhtar) దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత రితేష్ సిద్వానీ ఈ సినిమాకు నిర్మాత‌.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి రణవీర్ తప్పుకుంటున్నట్లు వార్తలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా రణవీర్ మూవీ నుంచి తప్పుకోవటంపై డాన్ 3 మేకర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు‌. రణవీర్ తప్పుకోవడం వల్ల తమకు 40 కోట్ల లాస్ అంటూ బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో పాటు అమీర్ ఖాన్ కీలకంగా ఉన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముందు పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే మేకర్స్ చెప్పిన దాని ప్రకారం.. డాన్ 3 చిత్రీకరణ కోసం పర్సనల్‌గా 28 మంది స్టాఫ్, ఏడు వానిటీ వ్యాన్స్, ఓ డీజె ట్రూప్ ప్రతిరోజు తనకు అందుబాటులో ఉండాలని రణవీర్ కోరార‌న్నారు. అందుకు తాము అంగీక‌రించి పలువురు టెక్సీషియన్స్‌కు అడ్వాన్సులు ఇచ్చి చిత్రీకరణకు సిద్ధం అవుతున్న స‌మ‌యంలో అతను సినిమా నుంచి స‌డ‌న్‌గా తప్పుకున్నట్లు తెలిపారు. దీనివల్ల తమకు భారీగా ఆర్థిక నష్టం ఏర్పడింద‌న్నారు. రణవీర్ అన్ ప్రొఫెషనల్‌గా అతని కోరికలన్నింటిని తమపై రుద్దాలని ప్రయత్నించినట్లు చెప్పారు.

అయితే రణవీర్ టీమ్ మాత్రం.. తమ హీరో డాన్ 3 సినిమా కోసం రెండేళ్ల పాటు వెయిట్ చేశాడ‌ని.. ఫరాన్ అక్తర్ బౌండ్ స్క్రిప్ట్ సిద్దం చేయకుండా, నటుడిగా సినిమాలు చేస్తూ తమ హీరో సమయాన్ని వృథా చేశాడని అంటున్నారు. అందువల్లే రణవీర్ డాన్ 3 నుంచి త‌ప్పుకున్నాడ‌న్నారు. అనంతరం ఈ సినిమా కోసం ఫరాన్.. హృతిక్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని.. కానీ ఎప్పుడయితే ధురంధర్ సినిమా సంచలన విజయం సాధించిందో అప్ప‌టి నుంచి రణవీర్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనవసరమైన వివాదాన్ని మేకర్స్ సృష్టించినట్లు చెబుతున్నారు. మరి బాలీవుడ్ పెద్దలు ఈ వివాదాన్ని తీరుస్తారా లేక‌ రణవీర్‌పై లీగల్‌గా ప్రొసీడ్ అవుతారా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది‌.

Updated Date - Feb 12 , 2026 | 08:34 AM