Ramayana: ‘రామాయణ’ రిలీజ్ డేట్ అఫీషియల్‌..

ABN , Publish Date - Aug 06 , 2026 | 02:40 PM

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమా విడుదల తేదీపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. 

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమా విడుదల తేదీపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా రూ. 4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగాన్ని నవంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. గతంలో ప్రకటించినట్లుగానే తొలి భాగం ఈ ఏడాది, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, అద్భుతమైన విజువల్స్‌, హాలీవుడ్ స్థాయి VFXతో రూపొందిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. 

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో  కాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపు చూసేలా ఈ ఇతిహాసం తెరకెక్కిందని నిర్మత నమిత్ మల్హోత్రా చెబుతున్నారు.  సినిమాపావు అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ విడుదల తేదీ హీరో రణ్‌బీర్ కపూర్ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నిలువనుంది.  అదే రోజు ఆయన కుమార్తె రాహా పుట్టినరోజు కావడం విశేషం. 

Updated Date - Aug 06 , 2026 | 03:22 PM