Ramayan: రణ్‌బీర్ రాముడు వచ్చేసాడు.. మహేష్ రాముడి లుక్ ఎప్పుడు
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:04 AM
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ చూడని అతిపెద్ద విజువల్ వండర్స్ కోసం ఆడియెన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ.. ఇంకోవైపు టాలీవుడ్ జక్కన్న, మన సూపర్‌స్టార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ చూడని అతిపెద్ద విజువల్ వండర్స్ కోసం ఆడియెన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ(Ramayana).. ఇంకోవైపు టాలీవుడ్ జక్కన్న, మన సూపర్‌స్టార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). ఈ రెండు సినిమాల కనెక్షన్ ఏంటో తెలుసా..? శ్రీరాముడు. అవును, రణ్‌బీర్ కపూర్ రాముడిగా లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తుంటే.. మరి మన మహేష్ బాబు రాముడి లుక్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ముందుగా నితీష్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న రామాయణ గురించి మాట్లాడుకుంటే.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ పిక్చర్ ఏకంగా రెండు భాగాలుగా, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. సీతగా సౌత్ క్వీన్ సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసాక ప్రతీ ఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. విజువల్ గ్రాండియర్ అంటే ఇదీ అనిపించేలా హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో సీన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. ముఖ్యంగా రాముడి గెటప్‌లో రణ్‌బీర్ కపూర్ పర్ఫెక్ట్ డివైన్ లుక్‌తో అలరించగా.. సాయి పల్లవి, యష్ తమ పెర్ఫార్మెన్స్‌తో విశ్వరూపం చూపించారు. బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సౌత్‌లో కూడా ఈ ట్రైలర్ కుమ్మేసింది.
ఇక మన దర్శకుడు జక్కన్న తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ రేంజ్ వేరే లెవెల్. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దాదాపు 1400 కోట్ల బడ్జెట్‌తో వారణాసి రాబోతుంది. ఈ సినిమాలో రామాయణానికి సంబంధించిన ఒక పవర్ ఫుల్ పార్ట్‌ను రాజమౌళి ఇప్పటికే పిక్చరైజ్ చేయడం జరిగింది. అందులోనూ శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబును చూడబోతున్నామనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. రాజమౌళి విజన్‌లో మహేష్ రాముడి లుక్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రెండు కళ్ళు చాలడం లేదని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ నడుస్తోంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ప్రీ-గ్లింప్స్ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆకలి మీదున్నారు. ఇక ఇప్పుడు అందరి కళ్ళూ ఆగష్టు 9వ తేదీపైనే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా వారణాసి టీమ్ నుంచి ఏమైనా స్పెషల్ లుక్ లేదా బిగ్ అప్‌డేట్ వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ రాముడిగా తన మార్క్ చూపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. మహేష్ రాముడి అవతారంలోకి దిగితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా, భారతీయ ఇతిహాసమైన రామాయణ కథాంశంతో వస్తున్న ఈ రెండు బిగ్గెస్ట్ విజువల్ వండర్స్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయం. మరి రణ్‌బీర్ కపూర్, మహేష్ బాబులలో రాముడి పాత్రలో ఎవరి లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందో చూడాలి