అరణ్యవాసంలో రాముడు-సీత.. రామాయణ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉంది

ABN , Publish Date - Sep 14 , 2026 | 09:40 AM

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో, అగ్ర నిర్మాత నమిత్ మల్హోత్రా దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పీరియాడిక్ ఎపిక్ రామాయణ (Ramayana).

Ramayana

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో, అగ్ర నిర్మాత నమిత్ మల్హోత్రా దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పీరియాడిక్ ఎపిక్ రామాయణ (Ramayana). ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్- 1 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా వినాయక చవితి శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించిన సీతా రామ్ పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ స్పెషల్ పోస్టర్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి అరణ్యవాసంలో నదీ తీరాన బండరాయిపై కూర్చుని ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తున్నారు. సీతాదేవి జుట్టులో శ్రీరాముడు ఆప్యాయంగా పువ్వును పెడుతున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని, ప్రేమను ప్రతిబింబించేలా ఉన్న ఈ మోషన్ విజువల్స్ సినీ ప్రియులను,అభిమానులను విశేషంగా అలరిస్తుంది.


ఇక ఈ పోస్టర్‌తో పాటు రామాయణ చిత్రానికి సంబంధించిన మొదటి సంగీత ఆల్బమ్ హంగామా కూడా ప్రారంభమైంది. ఆస్కార్ విజేతలు ఎ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మార్ సంయుక్తంగా స్వరాలు అందిస్తున్న ఈ సినిమా నుంచి జై జై రామ్ అనే మొదటి పాటను విడుదల చేశారు. ప్రఖ్యాత గాయకులు అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట అద్భుతంగా ఉంది. మరి భారతీయ సినిమా చరిత్రలోనే రామాయణ సరికొత్త రికార్డులను సృష్టిస్తుందా లేదా అనేది చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 09:46 AM