Ramayana: రామాయణ సెట్‌లో ’ భారీ అగ్నిప్రమాదం..  

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:02 PM

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నపాన్‌ ఇండియా చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నపాన్‌ ఇండియా చిత్రం ‘రామాయణ’ (Ramayana). ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.  ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చిత్ర బృందంతో పాటు అక్కడి ఇతర షూటింగ్‌ యూనిట్లలోనూ ఆందోళన నెలకొంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫిల్మ్‌సిటీకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  సుమారు 4 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సెట్స్‌లోని విద్యుత్‌ వైర్లు, చెక్క సామగ్రి, ఏసీ యూనిట్లు, వెదురుతో తయారు చేసిన నిర్మాణాలకు మంటలు అంటుకున్నట్లు సెట్లో సిబ్బంది తెలిపారు.  అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర సెట్స్‌కు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని తెలిసింది.  అగ్నిప్రమాదం కారణంగా ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ‘పతి పత్నీ ఔర్‌ పంగా 2’,   ‘హసెల్‌5’ చిత్రాల షూటింగ్‌లకు కొంత అంతరాయం ఏర్పడింది. 

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనుండగా.. యశ్‌ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

Updated Date - Oct 05 , 2026 | 08:44 PM