Rakul Preet Singh: శూర్పణఖ పాత్ర ఎందుకు ఒప్పుకున్నానంటే..

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:21 PM

నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న'రామాయణ'లో శూర్పణఖ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  నటిస్తున్నారు. ఈ పాత్రను అంగీకరించడానికి గల కారణాన్ని వెల్లడించారు.

బాలీవుడ్ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న'రామాయణ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నమిత మల్హోత్రా  దాదాపు 4 వేల కోట్లతో రెండు పార్టులుగా . మొదటి పార్జ్ ని ఈ ఏడాది దీపావళికి  విడుదల చేయనున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తుండగా..సన్నీ దియోల్‌, రవి దూబే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శూర్పణఖ పాత్రలో  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్‌.. ఈ పాత్రను అంగీకరించడానికి గల కారణాన్ని వెల్లడించారు.

"నాకు ఎప్పుడూ సవాలుతో కూడిన పాత్రలంటే ఎంతో ఇష్టం. శూర్పణఖ పాత్రను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అదే నాకు ఈ పాత్రను చేయాలనే ఆసక్తిని కలిగించింది. ఇప్పటి వరకు శూర్పణఖను అందరూ ఒకే కోణంలో చూశారు. కానీ ఆమె జీవితంలో మరో వైపు కూడా ఉంది. 'రామాయణ' విడుదలైన తర్వాత ప్రేక్షకులు శూర్పణఖను కొత్త కోణంలో చూస్తారని ఆశిస్తున్నాను' అని రకుల్‌ చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలు పెంచింది. 

Updated Date - Aug 03 , 2026 | 05:28 PM