సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తొలి చిత్ర కథానాయకుడితోనే వందో సినిమా!

ABN, Publish Date - Mar 13 , 2026 | 01:35 PM

తన తొలి చిత్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ తోనే వందో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు ప్రియదర్శన్‌. ప్రస్తుతం ఆయన అక్షయ్‌ కుమార్‌ తో 'భూత్‌ బంగ్లా' మూవీ చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.

Priyadarsan - Mohan Lal

భారతీయ సినిమా రంగంలో దర్శకుడిగా ప్రియదర్శన్‌ (Priyadarsan) కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మలయాళ చిత్రసీమలోనే కాదు... హిందీ రంగంలోనూ తనదైన ముద్రను వేశారాయన. తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలను తెరకెక్కించారు. తాజాగా ప్రియదర్శన్ తన వందో సినిమాకు సంబంధించిన ప్రణాళికలను సిద్థం చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రియదర్శన్‌ హిందీలో 'భూత్‌ బంగ్లా' సినిమా చేశారు. అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) అందులో హీరో. ఈ సినిమా ఇదే యేడాది ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీని ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ప్రియదర్శన్‌... తన వందో సినిమాకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.

Updated Date - Mar 13 , 2026 | 01:35 PM