సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిజమైన ప్రతిభకు హంగామా అవసరం లేదు...

ABN, Publish Date - Mar 28 , 2026 | 02:39 PM

మార్చి 28 అక్షయ్‌ ఖన్నా జన్మదినం సందర్భంగా దర్శక, నిర్మాత ప్రశాంత్ వర్మ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ నుండి వస్తున్న 'మహాకాళి'లో అక్షయ్‌ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు.

Akshaye Khanna

మార్చి 28 బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పుట్టిన రోజు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు సినిమా 'మహాకాళి'. ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుండి వస్తున్న ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలు. ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు.


శనివారం అక్షయ్‌ ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్‌ వర్మ... 'మహాకాళి' వర్కింగ్‌ స్టిల్‌ను పోస్ట్ చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'నిజమైన ప్రతిభకు హంగామా అవసరం లేదని నిరూపించిన అసలైన నటుడు అక్షయ్ ఖన్నా' అని కితాబిచ్చారు ప్రశాంత్‌ వర్మ. సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్, శక్తివంతమైన నటనతో అక్షయ్‌ ఖన్నా తనదైన పంథాలో సాగుతున్నారని, ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని ప్రశాంత్ వర్మ తెలిపారు. అక్షయ్‌ ఖన్నాతో కలిసి చేసిన 'మహాకాళి' సినిమాను ప్రపంచానికి చూపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రశాంత్‌ వర్మ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.


'మహాకాళి' సినిమాను అక్షయ్‌ ఖన్నా అంగీకరించే సమయానికి 'ధురంధర్‌' మూవీ విడుదల కాలేదు. అప్పటికి 'ఛావా' మాత్రమే వచ్చింది. అయితే... 'ఛావా'లో ఔరంగజేబ్‌గా అద్వితీయ నటన కనబర్చి, తన సత్తాను ఈ తరానికీ తెలియచేశారు అక్షయ్ ఖన్నా. ఇక 'ధురంధర్‌'లో బలూచ్‌ నాయకుడు రెహ్మాన్‌ డకైట్‌ పాత్రకు అక్షయ్‌ ప్రాణం పోశారు. ఆ సినిమా... హీరో రణవీర్ సింగ్‌కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టిందో... దానికి సరి సమానమైన పేరు ప్రఖ్యాతులు అక్షయ్‌ ఖన్నాకూ దక్కాయి. దాంతో 'ధురంధర్‌: ది రివేంజ్‌'లో కూడా అక్షయ్‌ ఖన్నా పాత్రను ఫ్లాష్‌ బ్యాక్‌లో చూపిస్తారని కొందరు ఆశపడ్డారు కానీ దర్శకుడు ఆదిత్య ధర్‌ ఆ పని చేయలేదు. ఏదేమైనా 'ఛావా, ధురంధర్‌' చిత్రాలలోని నటనతో అక్షయ్‌ఖన్నా మరోసారి అందరి మనసుల్నీ దోచుకున్నాడు. అతని జన్మదినం సందర్భంగా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం అక్షయ్‌ ఖన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 03:02 PM