సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సౌత్ స్టార్స్‌కు అబ్లిగేషన్ అంటున్న ప్రకాశ్‌ రాజ్!

ABN, Publish Date - Mar 21 , 2026 | 10:40 AM

ధురంధర్‌ 2 ను ప్రశంసించిన సౌత్‌ స్టార్స్ పై ప్రకాశ్‌ రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆబ్లిగేషన్ తోనే వారు ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

Prakash Raj about South Stars

రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్‌ (Aditya Dhar) తెరకెక్కించిన 'ధురంధర్‌: ది రివేంజ్‌' (Dhurandhar: The Reveng) సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. నిడివితో నిమిత్తం లేకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు చిత్రసీమకు చెందిన పలువురు ఈ సినిమా చూసి, ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కొందరికి మాత్రం ఈ సినిమా విజయం మింగుడుపడకుండా ఉంది. ప్రముఖ నటి, కన్నడ రాజకీయ నాయకులు రమ్య (దివ్య స్పందన) ఈ సినిమాను తీవ్రంగా విమర్శించారు. ఈ మూవీ చూడటం వల్ల డబ్బు, సమయం వృధా కావడం తప్ప మరింకేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ సోషల్ మీడియాలో చాలా పెద్ద పోస్టే పెట్టారు. ఇక జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్‌ రాజ్ అయితే ఈ సినిమాను మెచ్చుకున్న సౌత్‌ స్టార్స్‌కు 'అబ్లిగేషన్‌' అనే ట్యాగ్ వేశారు.


టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ తదతరులు 'ధురంధర్‌: ది రివేంజ్' మూవీని చూసి దర్శకుడిని ఆకాశానికి ఎత్తేశారు. చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. రామ్‌ గోపాల్‌ వర్మ అయితే... 'ధురంధర్‌ 2' ఏకంగా వంద 'షోలే'లకు పెట్టు అనేశారు. అయితే ఈ రకమైన ప్రశంసలను మనసుకు తీసుకోవడానికి ప్రకాశ్‌ రాజ్‌ వల్ల కావడం లేదు. వీరిపై ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ సోషల్ మీడియాలో స్పందించారు. పరోక్షంగా 'ధురంధర్‌ 2'ను ప్రశంసించిన స్టార్ హీరోలను విమర్శించారు.


ప్రకాశ్‌ రాజ్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన మనసులోని మాట చెప్పారు. 'ధురంధర్‌ 2' మూవీని అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌ బాబు వంటి స్టార్స్ అభినందించారని, కానీ బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా ట్వీట్ వేశారా? అని ప్రకాశ్‌ రాజ్‌ ను ఓ నెటిజన్‌ అడిగారు. దానికి బదులిస్తూ ప్రకాశ్‌ రాజ్, 'దక్షిణాదికి సైతం అబ్లికేషన్ అనేది వ్యాపించినట్టుగా ఉంది' అని కామెంట్ చేశారు. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్‌, 'సౌత్ స్టార్స్ అంతా 'ధురంధర్‌ 2' సినిమా గురించి వ్యాఖ్యానిస్తుంటే, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ స్పందించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ చాటింగ్‌లోనే 'ధురంధర్‌ 2'కు తాను దూరంగా ఉంటానని, మీరు కూడా ఉంటున్నారా? అంటూ ప్రకాశ్‌ రాజ్‌ నెటిజన్స్ ను అడిగారు. మొత్తం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో 'ధురంధర్‌' లవర్స్, హేటర్స్ అంటూ రెండు వర్గాలు తయారయ్యి... ఒకరిని విమర్శిస్తూ, మరొకరు విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 10:40 AM