సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్పిరిట్ ఇష్యూపై ప్రకాశ్ రాజ్ వివరణ

ABN, Publish Date - Feb 09 , 2026 | 06:24 PM

'స్పిరిట్' మూవీ నుండి తాను వైదొలగినట్టు వస్తున్న వార్తలన్నీ ఫేక్ న్యూస్ అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. అసలు తానింతవరకూ షూటింగ్‌లోనే పాల్గొనలేదని తెలిపారు.

Prakash Raj

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్‌ రాజ్ (Prakash Raj) 'స్పిరిట్' (Spirit) సినిమా నుండి సృజనాత్మక విభేదాల కారణంగా వైదొలగాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఇంతవరకూ దర్శక, నిర్మాత సందీప్ రెడ్డి వంగా వివరణ ఇవ్వకపోవడంతో అది వాస్తవమేననే భావనకు చాలామంది వచ్చేశారు. అయితే ఈ విషయమై ప్రకాశ్‌ రాజ్ స్పందించారు. 'స్పిరిట్' మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు. తాను ఇంకా 'స్పిరిట్' షూటింగ్ లోనే పాల్గొనలేదని ప్రకాశ్‌ రాజ్ తెలిపారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారు కాస్తంత గౌరవంగా ప్రవర్తిస్తే బాగుంటుందని ప్రకాశ్‌ రాజ్ హితవు పలికారు. ఆ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మరి ప్రకాశ్‌ రాజ్ మాటలను బలపరుస్తూ సందీప్ రెడ్డి వంగా కూడా స్పందించి, నిజానిజాలను తెలియచేయడంతో పాటు ప్రకాశ్‌ రాజ్ ఎప్పటి నుండి షూటింగ్ లో పాల్గొంటారో తెలుపుతారేమో చూడాలి.

Updated Date - Feb 09 , 2026 | 06:25 PM