సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: ప్రభాస్ ఆదిత్యా ధర్ ఎందుకు కలిశారంటే..

ABN, Publish Date - Jun 11 , 2026 | 02:28 PM

ప్రభాస్ ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌ను కలిశారని, ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ నడిచిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. త్వరలో ‘కల్కి 2’ రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్‌’ పూర్తి చేయగానే ‘సలార్‌ 2’ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇటీవల ఆయన బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌ను కలిశారని, ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ నడిచిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

‘ఉరి: ది సర్జికల్‌ స్ర్టైక్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్యధర్‌ ఈ మధ్యనే రణవీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ‘ధురంధర్‌’ సిరీస్‌ చిత్రాలు తీసి బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నారు. తాజా భేటీలో ప్రభాస్‌, ఆదిత్యా పలు ఐడియాలను షేర్‌ చేసుకున్నారట. అయితే సినిమా కథలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. అయితే ప్రభాస్‌ భవిష్యత్తులో చేయబోయే చిత్రాలతో కొందరు బాలీవుడ్‌ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు భాగస్వాములు కావాలని ప్లాన్‌ చేస్తున్నారని, ఆ చర్చలే ఈ భేటీలో జరిగాయని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఆదిత్యాధర్‌ తదుపరి చిత్రం కూడా రణవీర్‌ సింగ్‌తోనే ఉంటుందని టాక్‌. జియో స్టూడియోస్‌ నిర్మించే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. ఒకవేళ ఆదిత్యాధర్‌తో ప్రభాస్‌ సినిమా ఓకే అయితే పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజీ ప్రాజెక్ట్‌ కానుందని అభిమానులు ఆనందపడుతున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 02:29 PM