సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నోరా ఫతేహి: రేపు ఏం జరుగుతుందో తెలీదు.. భయం నీడలో బతుకుతున్నాం

ABN, Publish Date - Mar 02 , 2026 | 06:09 PM

బాలీవుడ్‌ నటి నోరా ఫతేహికి దుబాయ్‌తో మంచి అనుబంధం ఉంది. తరచూ అక్కడ స్టేజ్‌ షోలు చేస్తుంటారామె.

బాలీవుడ్‌ నటి నోరా ఫతేహికి (Nora Fathehi) ) దుబాయ్‌తో మంచి అనుబంధం ఉంది. తరచూ అక్కడ స్టేజ్‌ షోలు చేస్తుంటారామె. ప్రస్తుతం దుబాయ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె తన భద్రత గురించి స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘ప్రస్తుతం నేను దుబాయ్‌ నుంచి భారత్‌కు చేరుకున్నాను. క్షేమంగా ఉన్నాను. యుద్ధ దృశ్యాలు, బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో నేను ఆధ్యాత్మికంగా, మానసికంగానూ పూర్తిగా అలసిపోయాను. సోషల్‌ మీడియాలోని వీడియోలు లోపలి నుంచి నన్నుకుదిపేస్తున్నాయి. ఈ ప్రపంచానికి ఇప్పుడు శాంతి కావాలి. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. దురదృష్టవశాత్తూ మనం అస్థిరత, భయం నీడలో బతుకుతున్నాం. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది’ అని నోరా ఫతేహి అన్నారు.



‘యుద్థం వల్ల సామాన్య ప్రజలు బలికావడంపై నోరా ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు పోవాలని ఎవరూ కోరుకోరు. ప్రతి ఏటా ఏదో ఒక దేశం మధ్య యుద్థం లేదా మారణకాండ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఆగిపోవాలి. అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, దేవుడిపై నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాను’ అని వీడియోలో పేర్కొన్నారు. 

Updated Date - Mar 02 , 2026 | 07:57 PM