రామాయణం.. ట్రైలర్ వాయిదా

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:43 AM

ఈరోజు విడుదల కావాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' ట్రైలర్ వాయిదా పడింది.

ramayana

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' (Ramayana) సినిమా అభిమానులకు స్వల్ప నిరాశ ఎదురైంది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ళ్ల ఈ రోజు (శుక్ర‌వారం) విడుదల కావాల్సిన రామాయణం ట్రైలర్‌ను చిత్ర బృందం వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేర‌కు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) విడుదల చేసిన ప్రకటనలో సోనీ పిక్చ‌ర్స్ (Sony Pictures Entertainment) తో భాగస్వామ్యం కుదరడం తమ కలను నిజం చేసిందని తెలిపారు. రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్ణయించుకున్న‌ట్లు కొత్త గ్లోబల్ ట్రైలర్ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

rama.jpeg

న‌మిత్ మ‌ల్హోత్రా మాట్లాడుతూ.. 100 ఏళ్లకు పైగా భారతీయ సినిమా చరిత్రలో ఇది గర్వించదగ్గ క్షణమని హాలీవుడ్‌లోని భారీ చిత్రాల మాదిరిగా రామాయణం సినిమాను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం కలిగిందని చెప్పారు. ఈ సినిమా ద్వారా భారతీయ సంస్కృతి, పురాణ సంపదను ప్రపంచం మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత‌కాలం తమపై నమ్మకం ఉంచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు నమిత్ మల్హోత్రా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువతే దేశ భవిష్యత్తని, మన సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి గర్వంగా చాటాలని తన సందేశంలో పేర్కొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 07:46 AM