ఓటీటీకి రామాయణ.. ఇదెక్కడి ట్విస్ట్
ABN , Publish Date - Nov 29 , 2026 | 08:56 PM
రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణం పార్ట్ 1 ఓటీటీ విడుదలపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. సినిమా కొన్ని నెలల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైకి రాదని తెలిపారు. ఓటీటీ డీల్‌పై ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ పార్ట్ 1 (Ramayana). ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపుతోంది. మొదట మిక్స్డ్ టాక్ ని అందుకున్నా కూడా ప్రేక్షకులు అన్ని భాషల్లో ఈ సినిమాని ఆదరించారు. ముఖ్యంగా రావణ పాత్రలో యష్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు రామాయణ పార్ట్ 2 వస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక థియేటర్లలో ఇప్పటికీ మంచి హోల్డ్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిర్మాత నమిత్ మల్హోత్రా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
సాధారణంగా ప్రతి సినిమా.. హిట్ అయినా, కాకపోయినా కూడా నెల తిరక్కుండానే ఓటీటీలో ప్రత్యేక్షమవుతోన్న విషయం తెల్సిందే. ఇక రామాయణ కూడా ఈ నెలలోనే ఓటీటీ బాట పడుతోంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా మాత్రం ఇప్పుడప్పుడే ఓటీటీకి వచ్చేలా లేదని తెలుస్తోంది. నమిత్ మల్హోత్రా కూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రామాయణ పార్ట్ 1 ఇప్పట్లో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టం చేయడంతో పాటు కొన్ని నెలల పాటు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైకి రాదని తేల్చి చెప్పారు. తాము ఈ ప్రాజెక్ట్‌ను కేవలం బిగ్ స్క్రీన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించామని, థియేటర్ల అనుభూతిని తగ్గించేలా త్వరగా ఓటీటీలోకి తీసుకురావడం తమ ఉద్దేశం కాదని వివరించారు.
అంతేకాకుండా, ప్రస్తుతం రామాయణ ఓటీటీ డీల్‌కు సంబంధించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, ఇంకా ఏ డిజిటల్ సంస్థకూ సినిమాను విక్రయించలేదని నమిత్ మల్హోత్రా వెల్లడించారు. సాధారణంగా కొన్ని నెలల్లోనే ఓటీటీలోకి వచ్చే సినిమాలకు భిన్నంగా రామాయణ విషయంలో సుదీర్ఘ విరామం తీసుకోవడం ఓటీటీ ప్రియులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. భారీ విజయం దిశగా సాగుతున్న ఈ ఎపిక్ డ్రామా, రాబోయే రోజుల్లో థియేటర్లలో మరిన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. మరి రామాయణ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.