సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సీక్రెట్స్ చెప్పిన మృణాల్...

ABN, Publish Date - Feb 20 , 2026 | 05:43 PM

ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. హృతిక్ రోషన్, షహీద్ కపూర్ సరసన తాను నటించినప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఇన్ సెక్యూరిటీతో వర్కౌట్స్ చేసి దాదాపు పదిహేడు కేజీల బరువు తగ్గాడని ఆమె చెప్పింది.

Mrunal Thakur

హిందీతో పాటు తెలుగువారికీ సుపరిచితమైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన తాజా చిత్రం 'దో దీవానే షహర్ మే' (Do Deewane Seher Mein) శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు హీరో సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) తో కలిసి ఆమె విశేషంగా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఆ సమయంలో మృణాల్ ఠాకూర్ చెప్పిన మాజీ బాయ్ ఫ్రెండ్ ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సహజంగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు తాము రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పరు కానీ బ్రేకప్ అయిన తర్వాత మాత్రం గత కాలపు ప్రేమ ముచ్చట్లను కథలు కథలుగా చెబుతుంటారు. మృణాల్ ఠాకూర్ సైతం అందుకు మినహాయింపు కాదు.


తన కెరీర్ ప్రారంభంలో స్కాండినేవియన్‌కు చెందిన ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతనికి చాలా ఇన్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండేదని మృణాల్ ఠాకూర్ తెలిపింది. మృణాల్ ఠాకూర్ అప్పట్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మూవీ 'సూపర్ 30'లో నటించింది. అలానే ఆ తర్వాత షహీద్ కపూర్‌ (Shahid Kapoor)తో 'జెర్సీ'లో యాక్ట్ చేసింది. వీరిద్దరినీ చూసి తన బాయ్ ఫ్రెండ్ చాలా జెలసీ ఫీలయ్యే వాడని, వాళ్ళలాగా హ్యాడ్సమ్‌గా కనిపించడానికి బాగా వర్కౌట్స్ చేసేవాడని మృణాల్ తెలిపింది. అందులో భాగంగా ఆ బాయ్ ఫ్రెండ్ ఏకంగా పదిహేను నుండి పదిహేడు కేజీల బరువు కూడా తగ్గిపోయాడని చెప్పింది. తాను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో ఉండటం వల్ల వర్క్‌పై ఫోకస్ పెట్టగలిగే దాన్నని, అది ఒక రకంగా మంచిదే అయ్యిందని ఆమె తెలిపింది. ఇన్ సెక్యూరిటీతో వర్కౌట్స్ చేసి బాగా బరువు తగ్గిన ఆ స్నేహితుడు ఆ తర్వాత వాటిని ఆపేయడంతో ఏకంగా ఇరవై కేజీల బరువు పెరిగాడని చెప్పింది. తానెప్పుడూ అతన్ని బరువు తగ్గమని చెప్పలేదని, అలానే కండలు ఉంటేనే తాను స్నేహం చేస్తానని కూడా అనలేదని మృణాల్ స్పష్టం చేసింది. ఏదేమైనా... ఇప్పుడు ఆమె జీవితం నుండి తప్పుకున్న ఆ బాయ్‌ ఫ్రెండ్ కారణంగా మీడియాకు మృణాల్ ఆసక్తికరమైన ముచ్చట్లు తెలిపింది.

Updated Date - Feb 20 , 2026 | 05:43 PM