సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mrunal Thakur: ధనుష్ నా అన్నయ్య.. బాంబ్ పేల్చిన మృణాల్

ABN, Publish Date - Feb 02 , 2026 | 12:51 PM

ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు బయట కలిసి కనిపిస్తే వారిమధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. అందులో కొన్ని నిజమయినా.. చాలావరకు అబద్దాలే ఉంటాయి.

Mrunal Thakur

Mrunal Thakur: ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు బయట కలిసి కనిపిస్తే వారిమధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. అందులో కొన్ని నిజమయినా.. చాలావరకు అబద్దాలే ఉంటాయి. అలా ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన రూమర్ ఏదైనా ఉంది అంటే అది బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ని పెళ్లాడబోతుందనేదే. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకుల తరువాత ధనుష్.. మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిపోయాడని, వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్స్ కి అటెండ్ కూడా అవుతున్నారని బాలీవుడ్ మీడియా తెలిపింది.

ధనుష్ - మృణాల్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్లే మృణాల్ కూడా ప్రతి వీడియోకి తమిళ్ సాంగ్ ని పెట్టడం, ఈ వార్తలను ఫన్నీగా తీసుకుంటున్నానని చెప్పడంతో పెళ్లి వార్తలు నిజమే అనుకున్నారు. అంతేకాకుండా ధనుష్ కుటుంబంతో మృణాల్ ఫోటోలు దిగడం, ధనుష్ సోదరి.. మృణాల్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.

అయితే తాజాగా మృణాల్ పెద్ద బాంబ్ పేల్చింది. ధనుష్ తనకు అన్నయ్య లాంటివాడని చెప్పి షాక్ ఇచ్చింది. తన పేరుతో ఉన్న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ధనుష్ తో పెళ్లి వార్తలను ఆమె ఖండించిన్నట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ పోస్ట్ లో ధనుష్ తో తన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ తేల్చిచెప్పినట్లు ఉంది. ఇకనుంచి ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని వేడుకొంది. 'నా పని మాత్రమే నన్ను పరిచయం చేస్తోంది. గాసిప్ కాదు అని నేను నమ్ముతాను. అయినప్పటికీ, నేను ఎప్పుడూ వ్రాయని కథలు, నేను ఎప్పుడూ చేయని సంభాషణలు మరియు నేను ఎప్పుడూ తీసుకోని నిర్ణయాలతో నా పేరు ముడిపడి ఉందని నేను గుర్తించాను.

ఇటీవల నా పెళ్లి వివాదం అని పిలువబడేది ఆన్‌లైన్‌లో చెలామణి అవుతోంది. నేను దాని గురించి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ధనుష్ ఎల్లప్పుడూ నాకు సోదరుడిలాంటివాడు. మేము పంచుకునేది పూర్తిగా పరస్పర గౌరవం, వృత్తి నైపుణ్యం మాత్రమే.. ఇంకేమీ కాదు. అయితే, ఒక స్త్రీ ప్రయాణాన్ని అంగీకరించడానికి బదులుగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కథనాలను సృష్టించడంలో ప్రజలు ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.

నేను మౌనంగా ఉన్నాను అంటే అది ఏదో దాస్తున్నాను అని కాదు. ఎందుకంటే, నా వ్యక్తిగత జీవితానికి బహిరంగ ధృవీకరణ అవసరం లేదని నేను నమ్ముతాను. ఆడిషన్లు, తిరస్కరణలు, దీర్ఘ రాత్రులు, అచంచలమైన ఆత్మవిశ్వాసం ద్వారా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. దాని కోసం చాలా కష్టపడ్డాను. ఆ ప్రయాణాన్ని ఒక్క పుకారు తగ్గించడం అన్యాయం. సోషల్ మీడియా అందరికీ ఒక స్వరాన్ని ఇస్తుంది. కానీ, అది బాధ్యతను కూడా కోరుతుంది. కొన్ని క్లిక్‌లు, లైక్‌లు, షేర్‌లు హానిచేయనివిగా అనిపించవచ్చు, కానీ, అవి నిజమైన వ్యక్తులను బాధిస్తాయి. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా చెప్తున్నాను' అంటూ ఆమె తెలిపింది. మరి ఇది నిజంగా మృణాల్ నే చెప్పిందా.. ? లేక ఆమె ఫ్యాన్స్ ఇలా సృష్టించారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 02 , 2026 | 12:53 PM