Mouni Roy: నడుమపై చేతులు వేశారు.. ఎంత చెప్పినా.. వినకుండా..
ABN, Publish Date - Jan 24 , 2026 | 06:46 PM
తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ ఓ కార్యక్రమంలో బయటపెట్టారు.
Mouni Roy: తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. హరియాణాలోని ఓ కార్యక్రమంలో ఫొటోల పేరుతో తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘కర్నాల్‌లో జరిగిన ఈవెంట్‌లో తాత వయసున్న ఇద్దరు అతిథులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో వారిపై అసహ్యం కలిగింది.
వేదికపైకి వెళుతుండగా ఆ ఇద్దరు, వారి కుటుంబ సభ్యులు ఫొటోల పేరుతో నా నడుముపై చేతులు వేశారు. వెంటనే ‘సర్ దయచేసి మీ చేతులు తీయండి’ అని చెప్పాను. అయినా అతడి ప్రవర్తన మారలేదు(Mouni Roy Viral Comments). స్టేజ్‌పై ఉండగా ఇద్దరు అంకుల్స్ అసభ్యకర రీతిలో సైగలు చేస్తూ ఇబ్బంది పెట్టారు. లో యాంగిల్‌లో వీడియోలు తీశారు.
దీంతో ప్రదర్శనను అనుకున్న సమయానికన్నా ముందే ముగించాల్సి వచ్చింది. ఇంత జరిగినా వారి కుటుంబ సభ్యులుగానీ, ఈవెంట్ ఆర్గనైజర్లుగానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నాలాంటి వారికే ఇలా జరిగితే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. మేం నిజాయతీగా పనిచేస్తూ సంపాదించుకునే కళాకారులం. సెలబ్రేషన్స్‌లోనూ భాగం అవుతుంటాం. అయితే, మేం వారి అతిథులమైనా.. వారు మాత్రం మమ్మల్ని ఇలా వేధించడం ఎంతవరకు న్యాయం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.