సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన నాగిని..

ABN, Publish Date - May 13 , 2026 | 04:28 PM

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ (Mouni Roy) విడాకులు తీసుకొంటున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. కొన్ని రోజులుగా మౌనీ రాయ్ తన సోషల్ మీడియాలో ఒంటరిగా కనిపించడం, భర్త సూరజ్ నంబియార్ తో కలిసి ఫోటోలు షేర్ చేయకపోవడం వంటి విషయాలు నెటిజన్లలో అనుమానాలకు దారితీశాయి.

Mouni Roy

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ (Mouni Roy) విడాకులు తీసుకొంటున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. కొన్ని రోజులుగా మౌనీ రాయ్ తన సోషల్ మీడియాలో ఒంటరిగా కనిపించడం, భర్త సూరజ్ నంబియార్ తో కలిసి ఫోటోలు షేర్ చేయకపోవడం వంటి విషయాలు నెటిజన్లలో అనుమానాలకు దారితీశాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందా?, విడాకులు తీసుకోబోతున్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇక ఆ రూమర్స్ ని నిజం చేయడానికి అన్నట్లు సోషల్ మీడియాలో ఆమె పెళ్ళి ఫోటోలను డిలీట్ చేసింది. అంతేకాకుండా ఒకరికొకరు అన్ ఫాలో కూడా అయ్యారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని కన్ఫర్మ్ అయ్యింది.


ఇక తాజాగా తన విడాకుల వార్తలపై మౌనీ స్పందించింది. విడాకుల వార్తలు అన్ని ఫేక్ అని చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలు పూర్తిగా అబద్ధం. దయచేసి మీడియా వారు మాకు కొంచెం స్పేస్, ప్రైవసీ ఇవ్వండి' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్ట్ తో మౌనీ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది. అయితే.. పెళ్ళి ఫోటోలను ఎందుకు డిలీట్ చేసింది. సూరజ్ ని ఎందుకు అన్ ఫాలో చేసింది అనేదానికి ఆమె సమాధానం చెప్పలేదు. ప్రస్తుతానికి అయితే ఈ విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.


ఇక మౌనీ గురించి చెప్పాలంటే.. సీరియల్స్ ద్వారా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ చిన్నది నెమ్మదిగా హీరోయిన్ గా మారింది. నాగిని సీరియల్ ద్వారా అమ్మడు తెలుగువారికి కూడా సుపరిచితమే. ఆ తరువాత గోల్డ్, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మౌనీ రాయ్.. చిరంజీవి నటిస్తోన్న విశ్వంభరలో ఐటెంసాంగ్ చేయనుంది. మరి ఈ సినిమా అమ్మడి తలరాతను మార్చేస్తుందేమో చూడాలి.

Updated Date - May 13 , 2026 | 05:08 PM