MM Keeravani: 22 కిలోలు తగ్గిన కీరవాణి.. కొత్త లుక్ చూసి అనుపమ్ ఖేర్ షాక్
ABN, Publish Date - Nov 14 , 2026 | 07:58 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నారు. కీరవాణిలో వచ్చిన ఈ మార్పును చూసి బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనలోని పట్టుదలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తన స్నేహితుడు కీరవాణిని కలిసిన అనుపమ్ ఖేర్.. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి బరువు తగ్గిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘‘నా స్నేహితుడు ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. హైదరాబాద్‌లో ఆయన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త ఉత్సాహం, శక్తితో కనిపించారు. ఇంత సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం చూసి గర్వంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.
అంతేకాదు.. కీరవాణి సంగీత ప్రతిభను కూడా అనుపమ్ ఖేర్ కొనియాడారు. ‘‘కీరవాణి.. సంగీతంలో మీరు ఓ మేధావి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. మీ జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం మరెంతో మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా’’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీరవాణి కొత్త లుక్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కీరవాణి ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’కి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.