మాళవిక మోహనన్: సముద్రపు గాలి.. ప్రశాంతంగా ఉండే అలలు.. సేద తీరుతున్నా
ABN, Publish Date - Apr 04 , 2026 | 01:28 PM
మార్చి నెల మిశ్రమ అనుభవాలతో గడిచిపోయిందని హీరోయిన్ మాళవిక మోహనన్ పేర్కొన్నారు.
మార్చి నెల మిశ్రమ అనుభవాలతో గడిచిపోయిందని హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ‘మార్చి నెలలో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా (tyagarajan Kumarrajan) దర్శకత్వం వహించే ‘పాకెట్ నవల’ చిత్రంలో నటించడం హైలెట్. మన తరంలోని అత్యుత్తమ ఫిల్మ్ మేకర్లలో ఆయన ఒకరు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం ఇప్పటివరకు లభించిన అత్యంత ప్రత్యేకమైన సృజనాత్మక అనుభవాల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం మార్చిలో చాలా రోజులు చెన్నైలోనే గడిపాను. ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి.
రోజంతా షూటింగ్‌లో పాల్గొని, రాత్రికి నా గదికి వచ్చి ఒంటరిగా గడపడం అంత తేలికైన పని కాదు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి మహాబలిపురం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించి, స్థానిక వంటకాలను రుచి చూశాం. దాదాపు నెల రోజుల పాటు ఒంటరితనాన్ని అనుభవించిన నేను రెండు రోజుల క్రితం ముంబై వచ్చాను. ఇక్కడ ఒక అద్భుతమైన సూర్యాస్తమయం చూడటం, పడవ ప్రయాణం చేయడం, ప్రశాంతంగా ఉండే అలలు, సముద్రపు గాలిలో సేదతీరడం ఎంతో ఓదార్పునిచ్చింది’ అని పేర్కొన్నారు.