ఛీఛీ.. సిగ్గు లేదా.. సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్
ABN, Publish Date - May 30 , 2026 | 07:59 PM
కొత్త కొత్త టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని ఆనందపడాలో.. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో ఎవరికీ అర్ధం కావడం లేదు.
కొత్త కొత్త టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని ఆనందపడాలో.. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో ఎవరికీ అర్ధం కావడం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే రుక్మిణి వసంత్ బికినీ వీడియో రచ్చ రచ్చ చేసింది.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక అవార్డు ఫంక్షన్ లో మాధురి బ్లాక్ అండ్ సిల్వర్ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ లో ఆమె క్లివేజ్ చాలా తక్కువ కనిపిస్తుంది. 59 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె వన్నె తగ్గని అందం కుర్రాళ్ళను సైతం ఫిదా చేస్తుంది. అయితే కొంతమంది ఆకతాయిలు.. మాధురి డీప్ ఫేక్ వీడియో ని క్రియేట్ చేశారు.
ఈ వైరల్ వీడియోలో, మాధురి దీక్షిత్ అత్యంత బోల్డ్ క్లివేజ్ చూపిస్తూ.. బ్లాక్ థై-హై స్లిట్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నట్లు చూపించారు. సాంప్రదాయ మరియు హుందాకైన దుస్తులకు పేరుగాంచిన మాధురి దీక్షిత్ ఇలాంటి దుస్తులలో కనిపించడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయి, ఆమెను విమర్శించడం ప్రారంభించారు. ఆ తరువాత అది డీప్ ఫేక్ వీడియో అని తెలిసి నెటిజన్స్ మండిపడుతున్నారు. ఛీఛీ సిగ్గు లేదా.. ఒక సీనియర్ నటిపై ఇలాంటి వీడియోలు తయారుచేయడమేంటి.. ఇలాంటి ఆకతాయిలను ఊరికే వదలకూడదు పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మాధురి ఈ డీప్ ఫేక్ వీడియోపై స్పందించలేదు.