Lust Stories: లస్ట్ స్టోరీస్.. వైబ్రేటర్ సీన్‌కు కథ ఏంటంటే..
ABN, Publish Date - Jun 11 , 2026 | 03:18 PM
లస్ట్ స్టోరీస్.. వైబ్రేటర్ సీన్‌కు మొదట అనుకున్నది ఎవరంటే.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కథల రాత, తీత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కథల రాత, తీత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న అంశాన్ని కూడా ఆయన బోల్డ్‌గా మార్చగలరు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించి షోలలోనూ వల్గారిటీ హద్దులు దాటడంతో ఎనోసార్లు ట్రోల్ అయ్యారు. ఆయనపై పలు డిబేట్లు నడిచాయి. కరణ్ దర్శకత్వంలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ అంథాలజీ ‘లస్ట్ స్టోరీస్’కు సంబంధించి దర్శకుడు కరణ్ జోహార్, నటి కృతి సనన్(Krithisonan) , టైగర్ ష్రాఫ్ మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కియారా అడ్వాణీ కెరీర్ kiara Adwani) బ్రేక్ ఇచ్చిన ఆ బోల్డ్ క్యారెక్టర్ కోసం కరణ్ జోహార్ మొదట కృతి సనన్‌ను అనుకున్నారట.
ఆ పాత్ర గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ ‘కియారా కంటే ముందు ఆ పాత్ర కోసం కృతీని సంప్రదించా. అశ్లీలత లేకుండా అందంగా చిత్రీకరించేలా అయితే చేస్తానని మొదట కృతీ అంగీకరించింది. ముఖ్యంగా ఆ కథలో వచ్చే ఒక పర్టిక్యూలర్ బోల్డ్ సీన్ (ఆర్గాజమ్ - వైబ్రేటర్ సీన్) చుట్టూనే మొత్తం కథ తిరుగుతుందని కృతి గ్రహించి పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత తన తల్లి సలహా తీసుకొంది. ‘అది ఒక సీన్ వరకూ అయితే ఫర్వాలేదు. కానీ 20 నిమిషాల సీన్ అయితే కథ దాని చుట్టూ తిరుగుతుంది.. కాబట్టి ఈ క్యారెక్టర్ చేయొద్దు' అని తన తల్లి చెప్పడంతో కృతీసనన్ ఆ సినిమా నుంచి తప్పుకొంది. ఈ కథ కేవలం దాని గురించే కాదని ఎంత చెప్పినా కృతి మాత్రం ఈ సిరీస్ మెయిన్ థీమ్ అదేనని గట్టిగా వాదించింది. ఆ తర్వాత ఈ పాత్ర కియారా అడ్వాణీ దగ్గరకు వెళ్లింది. ఈ సిరీస్‌లో కియారా అద్భుతమైన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకొంది. అక్కడి నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది’ అని కరణ్ చెప్పారు. అయితే కరణ్ ఈ కథను వివరించిన తీరు చాలా వింతగా అనిపించిందని కృతి సనన్ నవ్వుతూ పేర్కొంది.
ఈ సిరీస్ విషయంలో మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు కరణ్. ఈ ప్రత్యేక సన్నివేశాన్ని చేసి వెళ్లిపోతున్న కియారాను తొలిసారి చూశాడు సిద్ధార్థ్ మల్హోత్ర. ఆ సిరీస్‌లో అతను నటించకపోయినా కరణ్ జోహార్‌ను కలవడానికి వచ్చిన సిద్ధార్థ్ కియారాతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ, డేటింగ్ చేసి పెళ్లితో ఇద్దరూ సెటిలైపోయారని చెప్పారు.