Nupur Sanon: సడన్‌గా పెళ్లి చేసుకున్న.. రవితేజ హీరోయిన్
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:50 PM
రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన బ్యూటీ నుపుర్ సనన్ సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ అగ్ర కథానాయిక కృతిసనన్ (Kriti Sanon) సోదరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన బ్యూటీ నుపుర్ సనన్ సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ స్టెబిన్ బెన్ (Stebin Ben) తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ గత వారమే ఎంగేజ్ మెంట్ చేసుకుని తాజాగా జనవరి 10, ఆదివారం రాత్రి రాజాస్థాన్ ఉదయ్ పూర్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అయితే.. 2023లో వచ్చిన టైగర్ నాగేశ్వర రావుతో కెరీర్ ఆరంభించిన ఈ భామకు ఆ సినిమా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లి పోయింది. ఆపై మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కథానాయికగా సెలక్ట్ అవగా తీరా షూటింగ్‌కు వెళ్లే ముందే ఆ సినిమా నుంచి తప్పుకుని మరలా ఇటు వైపు చూడలేదు.
అలా అని హిందీలోనూ సినిమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలో ఉన్నఫలంగా ఇలా పెళ్లి చేసుకుని కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. వీరి వివాహానికి బాలీవుడ్ నుంచి కొద్ది మంది సెలబ్రిటీలు హజరయ్యారు.

ఇదిలాఉంటే నుపుర్ సోదరి కృతి సనన్ సైతం మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఆపై బాలీవుడ్ షిఫ్ట్ అయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కథానాయికగా చేతినిండా సినిమాలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది. జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది.