ప్రియాంక చోప్రా బాటలో కృతి సనన్

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:54 PM

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ అటు కెరీర్ ను ఇటు పర్సనల్ లైఫ్ ను పక్కా గా ప్లానింగ్ చేసుకుంది. ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో ఈ ముద్దుగుమ్మ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Kriti Sanon

గ్లామర్ ఇండస్ట్రీలో సక్సెస్ వేవ్‌ను రైడ్ చేయడం ఒక ఎత్తయితే, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం మరో ఎత్తు. ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటుతున్నాయంటే చాలు.. సొసైటీ నుంచి వచ్చే ప్రెజర్, పెళ్లి - పిల్లల డెడ్‌లైన్స్ హీరోయిన్లను కాస్త టెన్షన్ పెడుతుంటాయి. కానీ ఆ రూల్స్ అన్నిటికీ చెక్ పెడుతూ బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి సనన్ ఒక సంచలన విషయాన్ని తీసుకుంది. తాను కెరీర్ ఫుల్ పీక్స్‌లో ఉన్నప్పుడే 'ఎగ్ ఫ్రీజింగ్' చేయించుకున్నానంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ కరిష్మాతో మాట్లాడిన కృతి ఈ విషయాన్ని బయటపెట్టింది.


కృతిసనన్ తనకు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన 'మిమి' సినిమా షూటింగ్ టైమ్‌లోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పింది. ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం చాలా బరువు పెరగాల్సి వచ్చిందట. దాంతో ఆ టైమ్‌లోనే ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చి శరీరం కాస్త ఉబ్బడం కామన్. ఎలాగూ సినిమా కోసం వెయిట్ గేన్ అవ్వాలి కాబట్టి ఆ రెండు నెలల బ్రేక్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ సైలెంట్‌గా ఈ మెడికల్ ప్రొసీజర్‌ను ఫినిష్ చేసినట్లు కృతిసనన్ తెలిపింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సాగిన ఈ జర్నీ ఫైనల్ గా సక్సెస్ అయిందని... అయితే ఈ ప్రాసెస్ అంత ఈజీగా ఏమీ సాగలేదని కృతి తెలిపింది. ఆ సమయంలో మూడ్ స్వింగ్స్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ ఫేస్ చేశానని కృతి చాలా ఓపెన్‌గా ఒప్పుకుంది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి రోలర్ కోస్టర్ రైడ్‌ను ఎక్స్ పీరియన్స్ చేస్తుందో, తాను కూడా దాదాపు అలాంటి ఒడిదుడుకులే చూశానని.. కానీ ఇప్పుడు మాత్రం మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉందంటూ హ్యాపీగా చెప్పుకొచ్చింది. నిజానికి ఇండియన్ స్క్రీన్ పై ఈ మోడ్రన్ బాట పట్టిన ఫస్ట్ సెలబ్రిటీ కృతి కాదు. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన థర్టీస్ స్టార్టింగ్‌లోనే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోగా.. ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, యాక్ట్రెస్ మోనా సింగ్, రిచా చద్దా వంటి వారు కూడా ఇదే రూట్ ఎంచుకున్నారు. మరి కృతి సనన్ ఈ విషయాన్ని బయట పెట్టిన తర్వాత ఇంకెంతమంది ఈ బాట పడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

Updated Date - Jul 07 , 2026 | 02:55 PM