'ఖల్ నాయక్' ఈజ్ బ్యాక్
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:44 PM
మూడు దశాబ్దాల క్రితం బీటౌన్ ను ఊపేసిన మూవీ 'ఖల్ నాయక్'. బిగ్ స్టార్లు కలసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి మూవీకి ముప్పై ఏళ్ళ తర్వాత సీక్వెల్ వస్తుండటం ఆసక్తి రేపుతోంది.
బాలీవుడ్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్. 1993లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ 'ఖల్ నాయక్' కు సీక్వెల్ రాబోతోంది. 'ఖల్ నాయక్ రిటర్న్స్' పేరుతో ఈ ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన ఆ బ్లాక్‌బస్టర్ సినిమాలో సంజయ్ దత్ 'ఖల్ నాయక్'గా ఐకానిక్ అయితే.. జాకీ ష్రాఫ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌గా రక్తి కట్టించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత సీక్వెల్‌లో ఇద్దరూ మళ్ళీ కలసి వస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో జాకీ ష్రాఫ్ సీక్వెల్ ను కన్ఫామ్ చేశారు. ఈ సీక్వెల్ చేయడం తనకు ఎగ్జైట్‌మెంట్ గా ఉందని.. అందు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాక తన పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. మొదటి భాగంలో 'ఖల్ నాయక్' ని పట్టుకోవడానికి వేటాడిన పవర్‌ఫుల్ ఇన్‌స్పెక్టర్ రామ్ పాత్ర.. మూడు దశాబ్దాల కాలంలో ప్రమోషన్ పొంది పోలీస్ కమీషనర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందన్నారు. అలాగే జాకీ ష్రాఫ్ తాను స్వయంగా సుభాష్ ఘాయ్, సంజయ్ దత్‌తో మాట్లాడినట్టు తెలిపారు. సంజూ బాబా తన ప్రాణం అంటూ జాకీ ష్రాఫ్ తన స్నేహితుడి మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మాటలు విన్నాక మళ్ళీ ఆ పాత కాంబినేషన్ వెండితెర మీద చూడాలని ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగిపోయింది.
మొత్తానికి మొన్నటి వరకు ఊహాగానాలకే పరిమితమైన 'ఖల్ నాయక్' కు సీక్వెల్ ఉంటుందని ప్రకటన రావడంతో ఇండస్ట్రీ సైతం ఖుషీగా ఉంది. కాగా 'ఖల్ నాయక్' లో సంజయ్ దత్ నెగటివ్ షేడ్స్ ఉన్న టైటిల్ రోల్‌లో మెప్పించగా... జాకీ ష్రాఫ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. మరి మారిన కాలానికి అనుగుణంగా, మారిన ట్రెండ్‌లో సంజయ్ దత్ 'ఖల్ నాయక్' గా ఎలా ఉంటాడో, కమీషనర్ గా జాకీ ష్రాఫ్ ఎలాంటి యాక్షన్ అందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!
టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!
Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!