సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krithi Shetty: బేబమ్మ బాలీవుడ్ ఎంట్రీ.. పాపం ఇలా అయ్యిందేంటి

ABN, Publish Date - Jan 18 , 2026 | 06:19 PM

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి (Krithi Shetty). ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనుకున్నారు.

Krithi Shetty

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి (Krithi Shetty). ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి .. అయ్యింది ఒక్కటి అన్నట్లు.. ఉప్పెన తప్ప కృతి కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమా ఒక్కటి కూడా రాలేదు. వరుసగా సినిమాలు చేసింది కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. సరే తెలుగులో అంతగా వర్క్ అవుట్ కాలేదు.. తమిళ్ లో అయినా సెట్ అవుదామని.. కార్తీ (Karthi) సరసన అన్నగారు వస్తారు సినిమాలో నటించింది. ఆ సినిమా అసలు రిలీజ్ కే నోచుకోలేదు.

ఇక కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా చేసింది. ఇది కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రిలీజ్ కి నోచుకోవడం లేదు. అలా తమిళ్ లో కూడా అమ్మడిని దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఇలా అయితే లాభం లేదు అనుకోని కృతి బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నించింది. ఈ మధ్యనే ముంబైకి వెళ్లి ఆడిషన్ కూడా ఇచ్చి వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమాల్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకోని ఆడిషన్ కి రమ్మన్నారట. కృతి కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఆ ఆడిషన్ కి ఫినిష్ చేసి వచ్చింది. కచ్చితంగా ఈ ఛాన్స్ తనకు వస్తుంది అనుకుంటే.. మధ్యలో కీర్తి సురేష్ ఆ ఛాన్స్ ని తన్నుకుపోయిందని టాక్ నడుస్తోంది. కృతిని కాకుండా మేకర్స్ కీర్తిని హీరోయిన్ గా ఓకే చేసినట్లు సమాచారం. దీంతో కృతి బాలీవుడ్ ఆశలు పటాపంచలు అయ్యాయి. పాపం కృతి.. కనీసం బాలీవుడ్ లో అయినా విజయాన్ని చూడాలనుకుంటే కీర్తి వచ్చి అన్ని అడియాశలు చేసింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బేబమ్మను ఏ హీరో కాపాడతాడో చూడాలి.

Updated Date - Jan 18 , 2026 | 06:19 PM