విక్కీ- కత్రీనా కొడుకుని చూశారా.. ఎంత క్యూట్ ఉన్నాడో

ABN , Publish Date - Nov 08 , 2026 | 06:25 PM

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ (Katrina Kaif)- విక్కీ కౌశల్ (Vicky Kaushal) .. పండగపూట తమ అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Katrina Kaif

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ (Katrina Kaif)- విక్కీ కౌశల్ (Vicky Kaushal) .. పండగపూట తమ అభిమానులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. చాలా కాలంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చిన ఈ క్రేజీ జంట, ఎట్టకేలకు తమ ముద్దుల కుమారుడు విహాన్ కౌశల్ (Vihaan Kaushal) ముఖాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు షేర్ చేసిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.


ఈ ఫోటోలో కత్రినా కైఫ్ సాంప్రదాయ పసుపు రంగు దుస్తులలో ఎంతో అందంగా మెరిసిపోతుండగా, విక్కీ కౌశల్ ఆఫ్-వైట్ కుర్తా ధరించి చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్యలో ఉన్న చిన్నారి విహాన్ సాంప్రదాయ పసుపు రంగు నెహ్రూ జాకెట్, వైట్ కుర్తా ధరించి, కెమెరా వైపు చూస్తూ చేతులు ఊపుతున్న క్యూట్ లుక్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు బాబును మీడియా కంటికి పడకుండా జాగ్రత్త పడిన ఈ దంపతులు, ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించారు. ఈ పిక్ చూసిన అభిమానులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారి విహాన్ అచ్చం తండ్రి విక్కీ కౌశల్ పోలికలతో ఉన్నాడని కొందరు, అమ్మ కత్రినా లాంటి క్యూట్ స్మైల్ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.


2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న ఈ బెస్ట్ కపుల్‌కు గతేడాది విహాన్ జన్మించాడు. విహాన్ రాకతో వారి విక్కీ- క్యాట్ కుటుంబం మరింత సంతోషంగా మారింది. మొత్తానికి విక్కీ-కత్రినాల కొడుకు విహాన్ ఫస్ట్ లుక్ పిక్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో నెట్టింట సరికొత్త రికార్డు లైక్స్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. అభిమానులు ఈ చిన్నారికి ఆశీస్సులు అందిస్తూ తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 08 , 2026 | 06:25 PM