Katrina Kaif: రాత్రి బెడ్ పై అలా చేస్తే విక్కీకి అస్సలు నచ్చదు
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:06 PM
వివాహబంధంలో భార్యభర్తలకు ఒకరి సపోర్ట్ ఒకరికి ఎంతో అవసరం. ముఖ్యంగా వర్క్ చేస్తూ ఇల్లు చక్కదిద్దుకొనే మహిళలకు భర్త సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం.
వివాహబంధంలో భార్యభర్తలకు ఒకరి సపోర్ట్ ఒకరికి ఎంతో అవసరం. ముఖ్యంగా వర్క్ చేస్తూ ఇల్లు చక్కదిద్దుకొనే మహిళలకు భర్త సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఈ సపోర్ట్ విషయంలో సెలబ్రిటీలు అతీతమేమి కాదు. అలా సపోర్ట్ లేకనే చాలామంది సెలబ్రిటీ జంటలు విడిపోయాయి. కానీ, కొంతమందికి మాత్రం భర్త సపోర్ట్ చాలా ఉంటుంది. అందులో తాను కూడా ఉన్నాను అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. బాలీవుడ్ లవ్లీ కపుల్స్ లిస్ట్ లో విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా కైఫ్ (Katrina Kaif) దంపతులు మొదటి వరుసలో ఉంటారు.
ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంట దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతోంది. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న కత్రీనా.. మరోవైపు తన బిజినెస్ కే బ్యూటీ (K-Beauty) బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో నిరంతరం శ్రమిస్తుంది. అయితే ఈ బిజినెస్ జర్నీలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లు, భర్త విక్కీ కౌశల్ తనను ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారనే విషయాలపై తాజాగా కత్రీనా కైఫ్ నోరు విప్పింది. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ.. 'నాలోని ఆందోళనలను.. హడావుడిని ప్రశాంతతగా మార్చే అద్భుతమైన శక్తి నా భర్త విక్కీ సొంతం. ఆయన నా హిస్టీరియాకు సరైన శాంతి లాంటివాడు. నా ఆరోగ్యం గురించి విక్కీ చాలా శ్రద్ధ తీసుకుంటాడు.
ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో ఫోన్ చూస్తే విక్కీకి అస్సలు నచ్చదు. ఎక్కువసేపు అలా చేస్తే సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు. రేయింబవళ్లు పని చేస్తూ ఉంటావ్.. రెస్ట్ తీసుకొనే సమయంలో కూడా ఫోన్ ఏంటి.. ? ఇంక ఫోన్ పక్కన పెట్టేయ్ అంటూ విక్కీ హెచ్చరిస్తుంటాడు. సెలవులు దొరికినప్పుడు వాటిని పూర్తిగా ఆస్వాదించాలి తప్ప, వారాంతాల్లో కూడా వ్యాపారాల గురించి మాట్లాడితే అతనికి అస్సలు నచ్చదు. అందుకే ఇంట్లో ఎక్కువ బిజినెస్ విషయాలను చర్చించుకొము' అని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక నటిగా, వ్యాపారవేత్తగా, గృహిణిగా అన్నింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమైనప్పటికీ, విక్కీ ఇస్తున్న మానసిక స్థైర్యమే తనకు అసలైన ఉపశమనం అని కత్రీనా.. భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. ఒకరికొకరు ఇచ్చే మానసిక మద్దతే తమ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని కత్రీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కత్రీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగా విక్కీ లాంటి భర్త దొరకడం కత్రీనా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమని, ఈ జంట కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.