సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బికినీలో కరీనా.. 45 ఏళ్ల వయస్సులో కూడా పిచ్చెక్కిస్తోందే

ABN, Publish Date - Aug 16 , 2026 | 07:02 PM

ఇండస్ట్రీలో అందమైన, ఆదర్శవంతమైన జోడీలు చాలామందే ఉన్నారు. వారిలో బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ జంట ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటారు.

Kareena Kapoor khan

ఇండస్ట్రీలో అందమైన, ఆదర్శవంతమైన జోడీలు చాలామందే ఉన్నారు. వారిలో బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) - కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) జంట ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటారు. దాదాపు 16 ఏళ్లకు పైగా తమ వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తూ నేటికీ ఐకానిక్ కపుల్‌గా నిలుస్తున్నారు. వీరికి తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు సైఫ్ - కరీనా విడిపోయారంటూ పుకార్లు వచ్చిన ప్రతిసారీ.. వారి ప్రేమతో చెక్ పెడుతూ ఉంటారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ తన 56వ పుట్టినరోజును జరుపుకోగా, సతీమణి కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు అత్యంత ప్రత్యేకంగా విష్ చేసి తన ప్రేమను చూపించింది. సైఫ్‌ను తన ఫరెవర్ రైడ్ ఆర్ డై అని అభివర్ణిస్తూ, ఆయన లేకపోతే జీవితం ఎంతో బోరింగ్‌గా ఉండేదంటూ సరదాగా క్యాప్షన్ కూడా జతచేసింది.


ఈ సందర్భంగా కరీనా షేర్ చేసిన రేర్ ఫోటో డంప్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా తమ పిల్లలతో గడిపిన సరదా క్షణాలు, ట్రావెల్ పిక్స్, ప్లేఫుల్ మిర్రర్ సెల్ఫీలను ఆమె అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా బీచ్ ఒడ్డున కరీనా కపూర్ వైట్ బికినీలో మెరవగా, సైఫ్ అలీ ఖాన్ వైట్ షర్ట్, రెడ్ షార్ట్స్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. 45 ఏళ్ల వయసులో కరీనా, 56 ఏళ్ల వయసులో సైఫ్ ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ, వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు. ముఖ్యంగా కరీనా.. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఆమె బికినీలో పిచ్చెక్కించింది.


ఇక సినిమాల విషయానికి వస్తే, ఇద్దరూ తమ రాబోయే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ త్వరలోనే అక్షయ్ కుమార్‌తో కలిసి హైవాన్ అనే చిత్రంలో కనిపించనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. మరోవైపు కరీనా కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం దాయరా షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటుంది.

Updated Date - Aug 16 , 2026 | 07:12 PM