సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

షాకింగ్.. సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న కంగనా రనౌత్

ABN, Publish Date - May 22 , 2026 | 05:30 PM

బాలీవుడ్ క్వీన్, ఎంపీ, కంగనా రనౌత్ (Kangana Ranaut) సీక్రెట్ గా పెళ్ళి చేసుకుందా.. నిజమేనా. ప్రస్తుతం బాలీవుడ్ ని ఊపేస్తున్న ప్రశ్న ఇది.

Kangana Ranaut

బాలీవుడ్ క్వీన్, లోక్ సభ సభ్యురాలు కంగనా రనౌత్ (Kangana Ranaut) సీక్రెట్ గా పెళ్ళి చేసుకుందా.. నిజమేనా. ప్రస్తుతం బాలీవుడ్ ని ఊపేస్తున్న ప్రశ్న ఇది. అసలు అందరిలో ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే.. తాజాగా కంగనా.. మెడలో మంగళసూత్రం, నుదుటన సిందూరం, చేతులకు మట్టి గాజులతో కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసి కంగనా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందా? అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఎప్పుడూ ఒంటరిగా, ఫైర్ బ్రాండ్‌గా ఉండే కంగనా సడన్‌గా ఇలాంటి లుక్‌లో కనిపించడంతో.. నెటిజన్లు ఆమెకు పెళ్ళి అయిపోయిందంటూ రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇక ఎప్పుడూ ఏ అనుమానాలకు తావు ఇవ్వని కంగనా.. తాజాగా ఈ రూమర్లపై స్వయంగా స్పందించి అసలు నిజాన్ని వెల్లడించింది.


'నేను రోజూ ఏదో ఒక షూటింగ్‌లలో పాల్గొంటూ ఉంటాను. ఎవరో ఒకరు నా క్యారెక్టర్ మేకప్‌లో ఉన్నప్పుడు ఈ ఫోటో, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాగే జరిగింది. నేను షూటింగ్ నుంచి వస్తున్న సమయంలో ఎవరో ఫోటో తీసి పోస్ట్ చేశారు. దీనివల్ల నాకు ఇప్పుడు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయినా పెళ్ళయ్యిన మహిళ లుక్‌లో కనిపించడంలో అంత పెద్ద విషయమేముంది? నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషిస్తుంటారు కదా. అయినా నేను రహస్యంగా పెళ్లి చేసుకోను, మీకు మాట ఇస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.


ఇక కంగనా ఈ లుక్ వెనుక విషయం ఏంటంటే.. ఆమె నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం క్వీన్ కి సీక్వెల్ అయిన క్వీన్ 2 షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించారు. వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఒక కీలకమైన సీన్ కోసమే కంగనా ఈ మంగళసూత్రం ధరించినట్లు సమాచారం. ఏదిఏమైనా కంగనా పెళ్ళి అయిన మహిళ లుక్ లో చాలా బావుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - May 22 , 2026 | 06:22 PM