సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kangana Ranaut: వైరల్ వీడియోలపై కంగనా రియాక్షన్.. ట్రోలర్స్‌కు గట్టి క్లాస్

ABN, Publish Date - Aug 01 , 2026 | 12:57 PM

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల యువతపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల యువతపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  పలువురు హిందూ యువతులు బాధ్యత లేకుండా.. స్వేచ్ఛ అనే సాకుతో  తిరుగుతున్నారని ఆమె విమర్శించారు. వారిని ‘గట్టర్‌ జనరేషన్’ అని  అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.  కొందరు నెటిజన్లు కంగనా వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆమె సినిమాల్లోని కొన్ని పాత్రలను, పాత వీడియోలను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా తనపై వస్తున్న విమర్శలకు  ఘాటుగా స్పందించారు. సినిమాలో పాత్రలు, నిజ జీవిత వ్యక్తిత్వాన్ని ఒకేలా చూడడం సరికాదన్నారు.  

'నటిగా కథకు అనుగుణంగా విభిన్న పాత్రలు చేయడం నా వృత్తిలో భాగం. వాటిని వ్యక్తిగత అభిప్రాయాలు, జీవన విధానంతో ముడిపెట్టడం సరికాదు. సినిమా సన్నివేశాలను చూపిస్తూ యువతకు అదే సరైన జీవన విధానమని చెప్పడం ప్రమాదకరం. సినిమాల్లో కనిపించే ప్రతి అంశం వినోదం కోసం మాత్రమే. వాస్తవ జీవితంలో వాటిని అనుసరించడం కరెక్ట్ కాదు. నేను కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని సినిమాల్లో కొన్ని పాత్రలు పోషిస్తాను. భారీ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు నా చుట్టూ నా సొంత టీమ్, ఈవెంట్ నిర్వాహకులు, భద్రతా సిబ్బంది ఉంటారు. అలాంటి సందర్భాల్లో నేను చేసే పనులను చూపిస్తూ... ఓ అమాయక యువతిని కూడా రోడ్లపై, స్కూల్ ఫంక్షన్లలో, క్లబ్‌లలో అలాగే ప్రవర్తించొచ్చని మీరు నమ్మించాలనుకుంటున్నారా? ఈ రెండూ ఒకటేనా? దయచేసి యువతను తప్పుదోవ పట్టించకండి. యువతకు బాధ్యతాయుతమైన సందేశాలు వెళ్లేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. సోషల్ మీడియాలో విమర్శలు చేసే ముందు వాటి ప్రభావాన్ని కూడా ఆలోచించాలి' అని కంగనా సూచించారు. 

Updated Date - Aug 01 , 2026 | 01:36 PM