సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kangana Ranaut: ఐష్‌ స్పందించలేదు.. కంగనా రనౌత్‌ గట్టిగా ఇచ్చిపడేసింది

ABN, Publish Date - May 25 , 2026 | 10:17 AM

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొన్నేళ్లగా అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే!

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కొన్నేళ్లగా అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే! ప్రతిసారి డిఫరెంట్‌ అవుట్‌ఫిట్‌తో కేన్స్‌ ఎర్ర తివాచీపై (Cannes Red carpet) ఆమె హోయలొలికిస్తూ, భారతీయ సంప్రదాయాన్ని చాటి చెబుతూ అలరిస్తున్నారు. తన కుమార్తె ఆరాధ్య కూడా ఇందులో భాగమవుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ప్రముఖ డిజైనర్‌ అమిత్‌ అగర్వాల్‌ ప్రత్యేకంగా రూపొందించిన ‘లుమినారా’ అనే డీప్‌ సఫైర్‌-బ్లూ గౌను ధరించి ఐశ్వర్య రెడ్‌ కార్పెట్‌ వాక్‌ చేస్తూ ఆహుతుల్ని అలరించారు. అయితే ప్రతి ఏటాలాగే ఈసారి కూడా ఐశ్వర్యారామ్‌ ధరించిన డ్రెస్‌పై విమర్శలు వచ్చాయి. అయితే ఆ కామెంట్స్‌కు ఐష్‌ స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నారు. కానీ బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, ఎంపీ కంగనా రనౌత్‌ (kangana Ranaut) ఐశ్వర్యా రామ్‌ ఫొటోను షేర్‌ చేసి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.


‘స్టైలింగ్‌, ఫ్యాషన్‌ అనేది ఎవరికి నచ్చినట్లు వారు సెలెక్ట్‌ చేసుకునేవి. వారికి ఏది ఇష్టమో, ఏది సౌకర్యంగా ఉంటుందో దానికి తగినట్లు ధరిస్తారు. ఈ విషయంలో ఏ మహిళ ఎవరికీ ఎటువంటి వివరణ ఇచ్చుకోవాల్సిన పని లేదు. కేన్స్‌ ఉత్సవం రెట్‌ కార్పెట్‌పై ఐశ్వర్య ఎంతో అందంగా, అద్భుతంగా కనిపించారు. ఆమెను ఇంకో స్టైల్‌లో చూడాలనుకునే వారు.. అసలు మీ దగ్గర ఏముందో మొదట ప్రపంచానికి చూపించండి. ఆ తర్వాత కామెంట్స్‌ చేయండి. రెడ్‌ కార్పెట్‌పై ఎప్పుడూ యువ నటీమణులే కనిపించాలన్న రూలేమీ లేదు. 50 ఏళ్ల వయసున్న వారు కూడా మెరుస్తారు.. మెప్పిస్తారు. అది గమనించండి. వారిని చూడడం అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. లేదా చూడటం మానేయండి. అంతే కానీ ఇలా కామెంట్స్‌ చేయకండి’ అని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Updated Date - May 25 , 2026 | 11:11 AM