సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ధురంధర్‌: ది రివెంజ్‌పై కంగనా రనౌత్‌ ప్రశంసల జల్లు!

ABN, Publish Date - Mar 22 , 2026 | 07:01 PM

ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ‘ధురంధర్‌- ది రివెంజ్‌’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. యావత్‌ దేశం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ఆదిత్య ధర్‌ (Aditya Dhar) దర్శకత్వం వహించిన ‘ధురంధర్‌- ది రివెంజ్‌’ (Dhurandhar The Revenge) చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. యావత్‌ దేశం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఆదివారం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదిత్య ధర్‌ను కలిసి విష్‌ చేశారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాజాగా బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్‌ చిత్ర పరిశ్రమలోకి రావాలనే కొత్త మేకర్స్‌కి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ధురంధర్‌: ది రివెంజ్‌ చిత్రాన్ని అతను తెరకెక్కించిన విధానం ఎంతో నచ్చిందని కంగనా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.  



‘ధురంధర్‌’ సక్సెస్‌లో గొప్ప విషయం  ఏంటంటే.. ఆదిత్య దర్‌ ఒక సూపర్‌స్టార్‌డమ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. హాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్స్‌ ఎప్పుడూ నటుల కంటే గొప్పవారుగా ఉంటారు. కానీ, మనం మన చిత్ర నిర్మాతలకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వము. వారెంతో కష్టపడతారు. కానీ ఆ కష్టానికి తగ్గ పారితోషికం కూడా దక్కదు. పైగా వారు సూపర్‌స్టార్‌ల చేత వేధింపులకు గురవుతారు. ఈ కారణాల వల్లే ఇండస్ట్రీలో నిర్మాతగానో, సినిమాటోగ్రాఫర్‌గానో, ఇతర సాంకేతిక నిపుణుడిగానో కావాలని కలలు కనేవారిని ఇన్‌సైడర్స్‌, అవుట్‌సైడర్స్‌లో నేను చూడలేదు. ప్రతిభ ఉందని చెప్పుకొనే ప్రతి ఒక్కరూ నటుడు కావాలనే కోరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హీరోల కన్నా ఎక్కువగా వెలిగిపోతున్న స్టార్‌ దర్శకనిర్మాత ఉన్నారు. ఇవాళ్ల ఎంతోమంది ఆయన తీసిన కథను చూస్తున్నారు. వారంతా ఆయనలా కావాలనుకుంటారు. ఇండస్ట్రీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. సెల్యూట్‌ ఆదిత్య ధర్‌’ అని కంగనా పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోపక్క ధురంధర్‌-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ సినీ చరిత్రలో అతి తక్కువ టైమ్‌లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ చిత్రాల సరసన ధురంధర్‌-2 చేరింది.  

Updated Date - Mar 22 , 2026 | 08:24 PM