Kajal Agarwal: ది ఇండియా స్టోరీ ఎప్పుడంటే...
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:39 PM
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే జంటగా నటిస్తున్న సినిమా 'ది ఇండియా స్టోరీ'. ఈ సినిమా జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.
కంటెంట్ బేస్డ్ మూవీస్‌లో స్టార్ హీరోయిన్లు కూడా ఈ మధ్య కాలంలో బాగా నటిస్తున్నారు. అలానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ పట్ల ఆసక్తి చూపుతున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సైతం ఇప్పుడు థాట్ ప్రొవోకింగ్ మూవీలో నటించింది. అదే 'ది ఇండియా స్టోరీ' (The India Story). శ్రేయాస్ తల్పాడే హీరోగా నటించిన ఈ సినిమాను చెట్టన్ డీకే డైరెక్ట్ చేశారు. సాగర్ బి షిండే ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు నిర్మించారు. జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా ప్రెజెంట్ చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతోంది.
ఈ సినిమా గురించి మేకర్స్ చెబుతూ, 'ది ఇండియా స్టోరీ' మూవీకి స్లో పాయిజన్ అనేది ట్యాగ్ లైన్. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. అయితే ఈ రంగంలో అపరిమిత రసాయనాల వినియోగం కారణంగా భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఒక కుటుంబానికో, ఒక రాష్ట్రానికో సంబంధించిన సమస్య కాదు... మొత్తం దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతలకు సంబంధించిన సమస్య. ఈ సమస్యల వెనుక ఉన్న వ్యవస్థాపరమైన లోపాలను, నియంత్రణ వ్యవస్థల అవసరాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. పెస్టిసైడ్స్ కారణంగా ఎలాంటి సమస్యలను రాబోయే రోజుల్లో ఈ జాతి ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియ చేయబోతున్నాం' అని అన్నారు. కాజల్, శ్రేయాస్ జంట ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని, ఈ సినిమా ద్వారా అందించే సందేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుందని దర్శకుడు చెట్టన్ డీకే తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాతలుగా సుమిత్ బగాడే, అనితా జాధవ్, వినాయక్ సైదాని, కల్పేష్ షా, దేవ్యాని ఖోరాటే, ప్రేమ్ జోషి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని నిషాంత్ భాగవత్, సంగీతాన్ని మంగేష్ ఢాక్డే, ఎడిటింగ్‌ను ఆశిష్ మాథ్రే, సాహిత్యాన్ని షకీల్ అజామీ, సౌండ్ డిజైన్‌ను అన్మోల్ భావే అందిస్తున్నారు.