John Abraham: క్రికెట్ టీమ్‌ను కొనేసిన జాన్ అబ్రహాం
ABN, Publish Date - Jun 26 , 2026 | 07:08 PM
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. కానీ ఇండస్ట్రీలో కాదు... మరో రంగంలోకి అడుగుపెట్టేశాడు. సినిమా స్క్రీన్ నుంచి క్రికెట్ ఫీల్డ్‌లో కొత్త అవతారం ఎత్తుతున్నాడు.
బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం (John Abraham) ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. సిల్వర్ స్క్రీన్‌పై తన బాడీతో, యాక్షన్‌తో మెప్పించిన ఈ హంక్... ఇప్పుడు సినిమాలను పక్కన పెట్టి క్రికెట్ పిచ్‌పై సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన ఇక్కడ ప్లేయర్‌గా కాదు... ఏకంగా ఓ అంతర్జాతీయ క్రికెట్ జట్టుకే బాస్‌గా మారారు. యూరప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న 'యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్'లో నెదర్లాండ్స్‌కు చెందిన 'రోటర్‌డ్యామ్ డాకర్స్' ఫ్రాంచైజీని జాన్ అబ్రహాం కొనుగోలు చేసి ఆ జట్టుకు కో-ఓనర్‌గా మారారు.
ట్విస్ట్ ఏంటంటే... ఈ జట్టులో జాన్ అబ్రహాం ఒక్కరే కాదు ఆయనతో పాటు క్రికెట్ దిగ్గజాలు జాంటీ రోడ్స్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ కూడా భాగస్వామ్యులై ఈ టీమ్‌ను నడిపించబోతున్నారు. సమాజాన్ని ఏకం చేసే శక్తి ఒక్క క్రికెట్‌కే ఉందని.. అందుకే తాను ఈ లీగ్‌లో భాగమయ్యానని జాన్ అబ్రహాం స్వయంగా ప్రకటించారు.మేనేజింగ్ పార్టనర్ మధుకర్ శ్రీ కూడా ఈ టీమ్‌లో ఉన్నారు.
అయితే ఈ టోర్నమెంట్‌లో కేవలం జాన్ మాత్రమే కాదు... మరో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఈ లీగ్‌కు కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తుండగా, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ వా, మాథ్యూ హేడెన్ లాంటి లెజెండ్స్ కూడా వేర్వేరు జట్లకు ఓనర్లుగా ఉన్నారు. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాల్లో క్రికెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే లక్ష్యంగా మొత్తం ఆరు నగరాల ఫ్రాంచైజీల మధ్య ఈ టోర్నీ సాగనుంది. మరి ఈ సరికొత్త క్రికెట్ బిజినెస్‌లో మన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.