సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనుకున్నది సాధించిన కంగనా.. కృతి బికినీ యాడ్ డిలీట్

ABN, Publish Date - Aug 26 , 2026 | 06:22 PM

బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ నటించిన ఒక ప్రముఖ జువెలరీ బ్రాండ్‌కు చెందిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెల్సిందే.

Kriti Sanon

బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ (Kriti Sanon) నటించిన ఒక ప్రముఖ జువెలరీ బ్రాండ్‌కు చెందిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెల్సిందే. ఈ యాడ్‌లో కృతి సనన్ వేసుకున్న మోడ్రన్ ఇండో-వెస్ట్రన్/బికినీ తరహా దుస్తులు పండుగ సంప్రదాయానికి తగినట్లుగా లేవని, అలాగే పెంపుడు కుక్కకు రాఖీ కట్టడాన్ని పలువురు నెటిజన్లతో పాటు నటి, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో తప్పుపట్టిన విషయం కూడా విదితమే. రాఖీ కట్టేటప్పుడు బికినీ తరహా దుస్తులు ఎందుకు? అంటూ కంగనా విమర్శలు గుప్పించగా.. దీనిపై కృతి సనన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సంస్కృతి,సాంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి.. వేసుకునే డ్రెస్ నెక్‌లైన్‌లో కాదు అంటూ కృతి స్పష్టం చేసింది.


అయినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ మరింత తీవ్రతరం కావడంతో, సదరు జువెలరీ సంస్థ ఆ యాడ్‌ను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ.. 'భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. కేవలం కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ఉన్న ప్రేమను ప్రదర్శించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ యాడ్‌ను రూపొందించాం. అయితే దీనివల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ఈ యాడ్‌ను ఉపసంహరించుకుంటున్నాం' అని వివరణ ఇచ్చారు. యాడ్ డిలీట్ చేయడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ముగింపు పడింది.


ఇక ఇంకోపక్క అనుకున్నట్లుగా కంగనా.. తన పంతం నెగ్గించుకుంది. ఎలాగైనా సరే ఆ యాడ్ ని డిలీట్ చేయించింది అంటూ కొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. నిజంగానే కృతి అలాంటి దుస్తులు ధరించడం పద్ధతి కాదని, ఈద్ పండగకు.. ఒంటినిండా బట్టలు కప్పుకొని శుభాకాంక్షలు తెలిపింది. ఇక హిందువుల పండగకు మాత్రం ఇలాంటి దుస్తులు ధరించడంతోనే ఇంత రచ్చ జరిగిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ యాడ్ డిలీట్ చేయడంపై కృతి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - Aug 26 , 2026 | 06:22 PM