సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Janhvi Kapoor: మద్యం వ్యసనం.. జాన్వీ టీమ్‌ రియాక్షన్‌..

ABN, Publish Date - May 04 , 2026 | 05:26 PM

తన జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత మద్యం అలవాటు అయిందని, దానినుంచి బయటకు పడటానికి చాలా కష్టపడినట్లు ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేర్కొన్నారు

తన జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత మద్యం అలవాటు అయిందని, దానినుంచి బయటకు పడటానికి చాలా కష్టపడినట్లు ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! మద్యం అలవాటు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు కావాలనే వక్రీకరించాయని జాన్వీ మండిపడ్డారు. దీనిపై ఆమె వ్యక్తిగత టీమ్‌ స్పందించింది. ఆయా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే ‘ఆఫ్‌ ది రాక్స్‌’ ‘అమహా’ సంస్థలు నిర్వహించిన పాడ్‌క్యాస్ట్‌లో జాన్వీ మాట్లాడారనీ, ఆ మాటలను తప్పుగా వక్రీకరించారని సదరు సంస్థలు నోట్‌ విడుదల చేశాయి.
 
‘జాన్వీకపూర్‌, ఈ కార్యక్రమానికి సంబంధించిన కంటెంట్‌ను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేయడం మా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధకరమైన విషయం. జాన్వీకపూర్‌ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఆమె పంచుకున్న వ్యక్తిగత అనుభవాల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని, సందర్భాన్ని పక్కదోవ పట్టించేలా ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదు’ అని సదరు పాడ్‌క్యాస్ట్‌ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నోట్‌ను జాన్వీ కపూర్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వాస్తవాలు తెలుకోండి..  అవాస్తవాలను వైరల్‌ చేయకండి అని రాసుకొచ్చారు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో పెద్ది సినిమాలో నటిస్తోంది.

Updated Date - May 04 , 2026 | 05:33 PM