Janhvi Kapoor: అచ్చియమ్మ పాత్రపై ఎట్టకేలకు స్పందన..ఇకపై అలా జరగదు..
ABN, Publish Date - Oct 29 , 2026 | 04:12 PM
'పెద్ది’ సినిమాలో అచ్చియమ్మగా జాన్వీ పాత్రను చిత్రీకరించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
‘పెద్ది’ (Peddi)సినిమాలో అచ్చియమ్మగా జాన్వీ (Janhvi Kapoor) పాత్రను చిత్రీకరించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో సినీ ప్రముఖులు కూడా దానిపై స్పందించారు. అయితే దీనిపై తాజాగా ‘కాఫీ విత్ కరణ్ 9’ సీజన్ షోలో జాన్వీ మాట్లాడారు.
"ఈ ఇష్యూ పై నేను ఇప్పటిదాకా స్పందించకపోవడానికి కారణం ఉంది. ఆ సినిమా కోసం నేనొక్కదానినే కాదు.. చాలా మంది కష్టపడ్డారు. దీని వల్లా వాళ్ళు ఇబ్బంది పడకూడదని సైలెంట్ గా ఉన్నాను. ఆ విషయంలో నేను కూడా బాధ్యత తీసుకోవాలి. జరిగిన దానితో నాకూ బాధగా ఉంది. ఆ భారాన్ని నేను ఎప్పటికీ మోస్తూనే ఉంటాను’’ అని అన్నారు. ఇకపై ఈ విషయం గురించి నేను ఎక్కడ మాట్లాడాలనుకోవడం లేదు. ఒకవేళ నేను మాట్లాడితే.. ఎదుటి వారిని నిందించినట్లు అవుతుంది. షూటింగ్ టైంలో దర్శకుడు చెప్పినట్లు పనిచేయాలనే ఒత్తిడి ఉంటుంది. సౌత్ సినిమాల్లో ముందే పూర్తి స్క్రిప్ట్ ఇవ్వడం, అందులో కెమెరా యాంగిల్స్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొనడం అన్ని సందర్భాల్లో జరగదు. మున్ముందు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకుంటాను' అని జాన్వీ పేర్కొన్నారు.