Allu Arjun: ఇది పుష్పరాజ్.. రేంజ్ అంటే! భన్సాలీతో.. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ?
ABN, Publish Date - Feb 08 , 2026 | 04:04 PM
'పుష్ప' ఫ్రాంచైజీతో చిత్రంతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఇప్పుడు తన నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయబోతున్నాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
'పుష్ప' ఫ్రాంచైజీతో చిత్రంతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఇప్పుడు తన నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయబోతున్నాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సౌత్ హీరోలకు బాలీవుడ్ అంటే ఒక మైలురాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ (Bollywood) హీరోలే మన వైపు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో బాలీవుడ్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో సినిమా చేయబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు గుర్తొచ్చేవి భారీ సెట్లు, అద్భుతమైన కాస్ట్యూమ్స్, ఎమోషనల్ కథలు. దేవాదాసు, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇపుడు అల్లు అర్జున్ (Allu Arjun) కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్‌ను రెడీ చేసినట్లు సమాచారం. నిజానికి, గతంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు హిందీలో నేరుగా సినిమాలు చేసినా.. అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ, పుష్పతో హిందీ ఆడియన్స్‌కు బన్నీ ఆల్రెడీ దగ్గరయ్యారు.
అక్కడి మాస్ పల్స్ బన్నీకి బాగా తెలుసు. అందుకే, భన్సాలీ విజన్ కూడా ఈసారి బన్నీ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరీ ఫుల్ అయిపోయింది. పుష్ప-2 తర్వాత ఆయన లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అట్లీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైన్‌లో ఉంది. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుంది. ఈ రెండు భారీ చిత్రాల తర్వాతే భన్సాలీ సినిమా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
భన్సాలీ చెప్పిన కథకు బన్నీ ఇన్‌స్టంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ కాంబినేషన్ సెట్ అయితే, అది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఇక్కడ ఒక చిన్న ఆందోళన కూడా ఉంది. గతంలో మన స్టార్ హీరోలకు బాలీవుడ్ కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. నేటివిటీ సమస్యలు ఉండటం తో పాటు హిందీ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా పక్కాగా ప్లాన్ చేయక పోవడం వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి.
కానీ, బన్నీ విషయంలో ఆ భయం అక్కర్లేదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. కథ కొత్తగా ఉంటేనే ఓకే చెప్పే బన్నీ, భన్సాలీతో చేస్తున్నారంటే అందులో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఐకాన్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో.. అది ఇండియన్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి..!